Aman Sehrawat : అమ‌న్ కొద్దిలో త‌ప్పించుకున్నాడు..! లేదంటే వినేశ్ ఫోగ‌ట్‌లానే అన‌ర్హ‌త వేటు ప‌డేదా..! 10 గంట‌ల్లో 4.6 కేజీలు..

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త రెజ్ల‌ర్ అమ‌న్ సెహ్రావ‌త్ స‌త్తా చాటాడు.

Aman Sehrawat : అమ‌న్ కొద్దిలో త‌ప్పించుకున్నాడు..! లేదంటే వినేశ్ ఫోగ‌ట్‌లానే అన‌ర్హ‌త వేటు ప‌డేదా..! 10 గంట‌ల్లో 4.6 కేజీలు..

Aman Sehrawat lost over 4 kgs in 10 hours

Aman Sehrawat – Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త రెజ్ల‌ర్ అమ‌న్ సెహ్రావ‌త్ స‌త్తా చాటాడు. ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం గెలిచిన అతి పిన్న వయస్సు కలిగిన భారత అథ్లెట్ గా నిలిచాడు. కాగా.. అత‌డికి సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. కాంస్య ప‌త‌క పోరు కోసం అత‌డు 10 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 4.6 కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్లు రెజ్లింగ్ వ‌ర్గాలు తెలిపాయి.

భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ కేవ‌లం 100 గ్రాముల అధిక బ‌రువు ఉంద‌న్న కార‌ణంగా ఫైన‌ల్ బౌట్ ముందు ఆమె పై అన‌ర్హ‌త వేటు ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌రో రెజ్ల‌ర్ అమ‌న్ శెరావ‌త్ విష‌యంలో మేనేజ్‌మెంట్ అత్యంత జాగ్ర‌త్త‌లు తీసుకుంది. గురువారం జ‌రిగిన సెమీస్‌లో అత‌డు జ‌పాన్‌కు చెందిన రీ హిగుచి చేతలో ఓడిపోయాయ‌డు. గురువారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ జ‌రిగింది.

Olympics 2024 : ఒలింపిక్స్‌లో అదరగొట్టిన అమన్ సెహ్రావత్.. పీవీ సింధు ఎనిమిదేళ్ల రికార్డు బ్రేక్

దీంతో కాంస్య ప‌త‌క పోరులో మాత్ర‌మే అమ‌న్ శెరావ‌త్ త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. సెమీస్‌లో ఓట‌మి అనంత‌రం అత‌డి బ‌రువు 61.5 కేజీలు ఉంది. శుక్ర‌వారం కాంస్య ప‌త‌కం పోరు నాటికి అత‌డి బ‌రువు 57 కేజీల‌కు త‌గ్గాల్సి ఉంది. శుక్ర‌వారం ఉద‌యం అత‌డి బ‌రువు చూసేందుకు కేవ‌లం 10 స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీంతో బృందం అప్ర‌మ‌త్త‌మైంది. గంట పాటు వేడి నీటితో స్నానం చేయించారు. మ‌రో గంట పాటు ఆగ‌కుండా ట్రెడ్ మిల్‌పై ర‌న్నింగ్ చేయించి జిమ్‌కు తీసుకువెళ్లారు. అక్క‌డ క‌ఠిన‌మైన వ్యాయామాలు చేయించారు. ఓ అర‌గంట విరామం ఇచ్చారు.

ఐదు నిమిషాల బ్రేక్‌తో ఐదు సెష‌న్ల పాటు అత‌డికి సానా బాత్ చేయించారు. చివ‌రి సెష‌న్ స‌మ‌యానికి అత‌డు 900 గ్రాముల అధిక బ‌రువు ఉన్నాడ‌ని గుర్తించారు. దీంతో ఓ 15 నిమిషాల పాటు నెమ్మ‌దిగా జాగింగ్ చేయ‌మ‌ని సూచించారు. అప్పుడు స‌మ‌యం శుక్ర‌వారం ఉద‌యం 4.30 గంట‌లు. ఆ స‌మ‌యానికి అమ‌న్ బ‌రువు 56.9 కేజీలకు వ‌చ్చాడు. తాను పోటీ ప‌డే వెయిట్ (57కేజీల‌) కంటే వంద గ్రాములు త‌క్కువ‌గానే ఉన్నాడు. దీంతో అత‌డు కాంస్య పత‌క పోరులో పాల్గొనేందుకు మార్గం సుగ‌మం అయింది.

IND vs AUS : ఆసీస్ టూర్‌లో రెండు రోజుల డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నున్న భార‌త్‌.. అప్ప‌ట్లో అలా జ‌రిగినందుకేనా..?

అధిక బ‌రువు ఉండ‌డంతో రాత్రి నిద్ర పోలేద‌ని, రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియోలు చూశాన‌ని అమ‌న్ తెలిపాడు.