Allu Ayaan- Aravind : క్రికెట్ ఆడుతున్న తాతమనవడు.. అల్లు అయాన్ బ్యాటింగ్ అదుర్స్.. వీడియో వైరల్..
నిన్న ఆదివారం కావడంతో అల్లు అయాన్ తన తాత అల్లు అరవింద్ కలిసి ఇంటి వద్దే క్రికెట్ ఆడుకున్నారు.
Allu Ayaan- Aravind : మన సెలబ్రిటీల పిల్లల వీడియోలు, ఫోటోలు బయటకి వస్తే అవి వైరల్ అవ్వాల్సిందే. తాజాగా అల్లుఅర్జున్ తనయుడు అల్లు అయాన్ వీడియో వైరల్ గా మారింది. అల్లు స్నేహ రెడ్డి రెగ్యులర్ గా అల్లు అయాన్, అల్లు అర్హ ఫోటోలు, వాళ్ళు చేసే అల్లరి వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా గీత్ ఆర్ట్స్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది.
నిన్న ఆదివారం కావడంతో అల్లు అయాన్ తన తాత అల్లు అరవింద్ కలిసి ఇంటి వద్దే క్రికెట్ ఆడుకున్నారు. అల్లు అరవింద్ బౌలింగ్ వేస్తుంటే అల్లు అయాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయాన్ బ్యాటింగ్ అదరగొడుతున్నాడు. తాత మనవడు కలిసి సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న ఈ వీడియో వైరల్ గా మారింది.
దీంతో బన్నీ ఫ్యాన్స్ అయాన్ బ్యాటింగ్ అదరగొడుతున్నాడని, తాతమనవళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారని, ఎంత పెద్ద నిర్మాత అయినా మనవడితో ఇలా సరదాగా ఆడటం విశేషం అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అల్లు అరవింద్ – అల్లు అయాన్ క్రికెట్ ఆడుతున్న వీడియో చూసేయండి..+