Tollywood Actor : 49 ఏళ్ళ క్రితం ఫోటో షేర్ చేసిన నిర్మాణ సంస్థ.. ఈ పిల్లోడు ఇప్పుడు హీరో..
తాజాగా ఓ హీరో ఫోటో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ 49 ఏళ్ళ క్రితం తీసిన ఓ ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
![Tollywood Actor : 49 ఏళ్ళ క్రితం ఫోటో షేర్ చేసిన నిర్మాణ సంస్థ.. ఈ పిల్లోడు ఇప్పుడు హీరో.. Tollywood Actor : 49 ఏళ్ళ క్రితం ఫోటో షేర్ చేసిన నిర్మాణ సంస్థ.. ఈ పిల్లోడు ఇప్పుడు హీరో..](https://10tv.in/wp-content/uploads/2024/08/sumanth-1.jpg)
Tollywood Production House Shared a Hero 49 Years ago Photo goes Viral
Tollywood Actor : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరో ఫోటో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ 49 ఏళ్ళ క్రితం తీసిన ఓ ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
అన్నపూర్ణ నిర్మాణ సంస్థ 49 ఏళ్ళ క్రితం ఫోటో షేర్ చేసి.. 49 ఏళ్ళ క్రితం అన్నపూర్ణ గారు లిటిల్ సుమంత్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోకి శంకుస్థాపన చేసారు. ఇప్పుడు అది ఇండియన్ సినిమాలో ఒక మైల్ స్టోన్ గా తయారయింది. సినిమాని మేము ఎప్పుడూ సెలెబ్రేట్ చేసుకుంటాము అని పోస్ట్ చేసారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Prasanth Varma : చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన టీచర్లతో ‘హనుమాన్’ డైరెక్టర్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..
ఈ ఫొటోలో ఉన్నది అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణమ్మ అని, ఇక ఆ పిల్లోడు ఇప్పుడు హీరో సుమంత్ అని తెలిపారు. గతంలో సినిమాలతో హీరోగా సక్సెస్ అయిన సుమంత్ ప్రస్తుతం హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూనే కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram