GV Prakash Kumar : హ్యారీపోటర్ లాంటి సినిమాతో GV ప్రకాష్.. ఏకంగా మూడు భాగాలుగా..

తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు GV ప్రకాష్ కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాతో రాబోతున్నాడు.

GV Prakash Kumar : హ్యారీపోటర్ లాంటి సినిమాతో GV ప్రకాష్.. ఏకంగా మూడు భాగాలుగా..

GV Prakash Kumar Talk about Kingston Movie its looks like Harry potter Movies

Updated On : August 13, 2024 / 5:06 PM IST

GV Prakash Kumar : ఇటీవల మన ఇండియన్ సినిమా హాలీవుడ్ ని తలదన్నేలా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు GV ప్రకాష్ కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాతో రాబోతున్నాడు. గత సంవత్సరం కింగ్‌స్టన్ అనే సినిమాని ప్రకటించాడు GV ప్రకాష్. ఈ సినిమాలో తనే మెయిన్ లీడ్ గా నటించడమే కాకుండా ఈ సినిమాతో GV ప్రకాష్ నిర్మాతగా కూడా మారుతున్నాడు. గత సంవత్సరం కమల్ హాసన్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసారు.

తాజాగా GV ప్రకాష్ తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి మాట్లాడాడు. GV ప్రకాష్ మాట్లాడుతూ.. హ్యారీపోటర్ లాంటి ఓ భారీ సినిమాని తీస్తున్నాం. నేను, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇందులో నేను నటిస్తున్నాను. మూడు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా కచ్చితంగా చాలా కొత్తగా ఉంటుంది, అందర్నీ మెప్పిస్తుంది అని తెలిపారు.

Also Read : Janhvi Kapoor : అమ్మ పుట్టిన రోజున.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తిరుమలలో జాన్వీ కపూర్ సందడి..

హ్యారీపోటర్ సినిమాలకు ఇండియాలో కూడా భారీ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు GV ప్రకాష్ హ్యారీపోటర్ లాంటి సినిమా అనడంతో ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మరి GV ప్రకాష్ కింగ్‌స్టన్ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Image