Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ మండిపాటు

కల్యాణ లక్మి లక్ష రూపాయలు, తులం బంగారం ఇప్పటికీ ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ మండిపాటు

Bandi Sanjay

రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.26 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేసిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని సిరిసిల్ల పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో శ్రీ చండీ యాగంలో ఆయన పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందని బండి సంజయ్ చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని రైతులని మోసం చేసిందని, వడ్డీలకు వడ్డీ కట్టి రైతులు అప్పుల పాలు అయ్యారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బ్యాంక్ లోన్లు తీర్చి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.

రుణం తీసుకున్న రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్ రాకుంటే భవిష్యత్‌లో ఎలాంటి రుణం పొందలేరని బండి సంజయ్ చెప్పారు. రైతులకు 70 శాతం రుణమాఫీ జరగలేదని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకం అమలు కాలేదని విమర్శించారు.

కల్యాణ లక్మి లక్ష రూపాయలు, తులం బంగారం ఇప్పటికీ ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు. 30 వేల ఉద్యోగాలని 12 వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్దాల మేడలో కూర్చొని ప్రజలకు అన్ని చేశాం అని అనుకుంటుందని చెప్పారు. రైతులకు భరోసా కల్పించడంతో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.

Also Read: రంగారెడ్డి జిల్లాలో 40 పెద్ద భవనాలు కూల్చివేత.. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం