రంగారెడ్డి జిల్లాలో 40 పెద్ద భవనాలు కూల్చివేత.. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం
భారీ పోలీస్ బందోబస్తు నడుమ బిల్డింగ్ లను నేలమట్టం చేశారు అధికారులు. అడ్డుకోబోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Hydra Demolish Illegal Constructions : అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది హైడ్రా. రంగారెడ్డి జిల్లా గండిపేట, శంకర్ పల్లి, ఖానాపూర్ లో అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించడంతో కూల్చివేత చర్యలు తీసుకున్నారు. అనేక చెరువులను కబ్జా చేసి నిర్మించిన 40 పెద్ద భవనాలను భారీ యంత్రాల సాయంతో కుప్పకూల్చారు. కూల్చివేతల సందర్భంగా అధికారులు, భవనాల యజమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ బిల్డింగ్ లను నేలమట్టం చేశారు అధికారులు. అడ్డుకోబోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతంలో అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రాను రూపొందించింది. సంస్థకు చెందిన అధికారులు కొన్ని రోజులుగా యుద్ధప్రాతిపదికన అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు. ఇవాళ కూల్చివేయబడిన అక్రమ కట్టడాలు గండిపేట చెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయి. ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టారు అధికారులు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు సాగాయి.
Also Read : మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ