తప్పులు జరిగితే దోషులు ఎంతటి పెద్దవారైనా ఎవరినీ వదిలిపెట్టం: మంత్రి ఆనం

టీటీడీ బోర్డు సభ్యులను ఎంపిక చేయడం ముఖ్యమంత్రి పరిధిలో ఉందని చెప్పారు.

తప్పులు జరిగితే దోషులు ఎంతటి పెద్దవారైనా ఎవరినీ వదిలిపెట్టం: మంత్రి ఆనం

Anam Ramanarayana Reddy

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళ ఉదయం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక వస్తుందని తెలిపారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొరపాట్లు జరిగి ఉంటే దోషులు ఎంతటి పెద్దవారైనా ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. టీటీడీ బోర్డు సభ్యులను ఎంపిక చేయడం ముఖ్యమంత్రి పరిధిలో ఉందని చెప్పారు. అతి త్వరలోనే టీటీడీ బోర్డు ఏర్పా టు అవుతుందని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 74,957 మంది భక్తులు దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డీ దర్శనం కోసం దాదాపు 4 గంటల సమయం పడుతోంది.

Also Read : ఆపద్భాందవుడు అన్నయ్య.. ఆయన ఇచ్చిన మద్దతే జనసేనకు విజయం.. పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్..