ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ..!

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుందని అభిప్రాపడ్డారు.

ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ..!

Botcha Satyanarayana : ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను గుర్తించాలని ఛైర్మన్ కు లేఖ రాయనున్నారు వైఎస్ జగన్.

మండలి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తనకు అవకాశం ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాను పార్టీ కేంద్ర కార్యాలయం ఇంఛార్జ్ గా, పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా ఉన్నానని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీలో తనకు మరిన్ని బాధ్యతలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుందని అభిప్రాపడ్డారు.

తనకు వచ్చిన అభిప్రాయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ కు చెప్పానని, ఆయన ఆమోదించారని వెల్లడించారు లేళ్ల అప్పిరెడ్డి. మండలి ప్రతిపక్ష నేత హోదాకి రాజీనామా చేశానని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే మంచి జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇలాంటి సమయంలో సీనియర్ అయిన బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

 

Also Read : చంద్రబాబుకి భారీ ఊరట.. ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు