Actor Darshan : ఏందీ అన్నా ఇదీ.. పిక్నిక్కు వెళ్లావా ఏందీ..! జైల్లో దర్శన్‌కు రాజభోగాలు?
ఓ చేతిలో సిగరేట్.. మరో చేతిలో కాఫీ కప్పు.. హాయిగా కుర్చీలో కూర్చుని మరో ముగ్గురితో కబుర్లు చెబుతున్నారు కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే.
Darshan : ఓ చేతిలో సిగరేట్.. మరో చేతిలో కాఫీ కప్పు.. హాయిగా కుర్చీలో కూర్చుని మరో ముగ్గురితో కలిసి కబుర్లు చెబుతున్నారు కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే. ఇందులో తప్పు ఏముంది అని అంటారా..? అక్కడికే వస్తున్నాం ఆగండి. ఈ స్టార్ హీరో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అన్న సంగతి తెలిసిందే. 8 జూన్ 2024న అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఈ స్టార్ హీరో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు.
జైల్లో అతడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇందుకు నిదర్శనం ఇదేనంటూ ప్రస్తుతం పై ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోని అదే జైలులో ఉన్న ఓ ఖైదీ తన భార్యకు పంపాడని అది సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్‌గా మారినట్లుగా తెలుస్తోంది.
Amy Jackson : పెళ్లి చేసుకున్న రామ్‌చరణ్ హీరోయిన్.. ఒకరితో బిడ్డను కని, మరొకరితో..
జైలు అధికారులపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీన్ని చూస్తుంటే అతడు జైలుకి వెళ్లినట్లుగా లేదని, ఏదో పిక్నిక్కు వెళ్లినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ దీనిపై జైలు అధికారులు ఏమన్నా వివరణ ఇస్తారో లేదో చూడాల్సిందే.
దీనిపై రేణుకాస్వామి తండ్రి కాశీనాథ శివనగౌడర స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు కోర్టు అందుకు అనుమతించలేదు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. నాకు షాకింగ్‌గా ఉంది. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.’ అని అన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు.
Rajinikanth : విజయ్‌కు షాకిచ్చిన రజినీకాంత్.. సీఎం స్టాలిన్ పై ప్రశంసల జల్లు..
కాగా.. ఈ వారం ప్రారంభంలో దర్శన్, పవిత్రతో పాటు మరో 15 మందికి జ్యూడిషియల్ కస్టడీని ఆగస్టు 28 వరకు పొడిగించింది కోర్టు. మరోవైపు దర్శన్‌కు బెయిల్ తీసుకువచ్చేందుకు అతడి భార్య విశ్వప్రయత్నాలు చేస్తోంది.