Rajinikanth : విజయ్‌కు షాకిచ్చిన రజినీకాంత్.. సీఎం స్టాలిన్ పై ప్రశంసల జల్లు..
తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘తమిళ వెట్రి కజగం అనే పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే.

Super Star Rajinikanth comments in Kalaignar book release viral
తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘తమిళ వెట్రి కజగం’ అనే పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పాడు. ప్రస్తుతం తన పార్టీని బలోపేతం చేసే పనిలో విజయ్ ఉన్నాడు. ఈ తరుణంలో తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనంగా మారాయి. డీఎంకే పార్టీపైనా, సీఎం స్టాలిన్ పైనా సూపర్ స్టార్ ప్రశంసల జల్లు కురిపించారు.
డీఎంకే పార్టీ మర్రిచెట్టు లాంటిది. ఎలాంటి తుఫాను అయినా ఆ చెట్టును కదిలించలేదన్నారు. స్టాలిన్ చక్కగా పాలిస్తున్నారన్నారు. పార్టీని గొప్పగా నడుపుతున్నారని, సీనియర్లందరినీ కలుపుకొని ఒక టీచర్‌లా ఆయన పాలన సాగిస్తున్నారు. మీకు హాట్సాఫ్.. స్టాలిన్ సార్.. అంటూ రజినీ వ్యాఖ్యనించారు.
Viral video : పొలంలో భారీ కొండచిలువ.. ఓ ఆటాడుకున్న యువతి.. వీడియో వైరల్
సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం కరుణానిధి ఎంతో పాటుపడ్డారని అన్నారు. మంత్రి ఈవీ వేలు రచించిన ‘కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్’ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న రజినీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరు అయ్యారు. విజయ్ కొత్త పార్టీతో ప్రజల ముందుకు రానున్న తరుణంలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనంగా మారాయి.