తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా తీసుకురావాలి.. వాటిని కూల్చేయాలి: కాంగ్రెస్ నేతల విజ్ఞప్తులు

వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా తీసుకురావాలి.. వాటిని కూల్చేయాలి: కాంగ్రెస్ నేతల విజ్ఞప్తులు

CM Revanth Reddy

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రాకి మద్దతు పెరుగుతోంది. మొదట హైడ్రాపై సొంత పార్టీ కాంగ్రెస్‌ నేతలతో ఇబ్బందులు వస్తాయని రేవంత్ రెడ్డి భావించారు. అయితే, ఆయన నిర్ణయానికి కాంగ్రెసె ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు.

అంతేగాక, హైడ్రా లాంటి వ్యవస్థను తెలంగాణ మొత్తానికి విస్తారించాలని విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. హైడ్రా ఏర్పాటుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ అభినందనలు తెలుపుతూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైడ్రా తరహా వ్యవస్థను రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ తీసుకురావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.

వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజ్ఞప్తి చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని వేముల వీరేశం కోరుతున్నారు. అలాగే, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్యతో పాటు పలువురు హైడ్రాను మరింత విస్తరించాలని కోరారు.

Also Read: అప్రమత్తంగా ఉండండి.. హైదరాబాద్ యువతకు, వారి తల్లిదండ్రులకు సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక సూచన..