Sundarakanda Teaser : మూలా నక్షత్రంతో నారా రోహిత్ తంటాలు.. నవ్వులు పంచేలా ‘సుందరకాండ’ టీజర్
ప్రతినిధి 2 మూవీతో మంచి విజయాన్ని అందుకున్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’.

Nara Rohith Sundarakanda Teaser out now
Sundarakanda Teaser : ప్రతినిధి 2 మూవీతో మంచి విజయాన్ని అందుకున్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. వృతి వాఘని కథానాయికగా నటిస్తోంది. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు. సిద్ధార్థ్ అనే పాత్రలో నారా రోహిత్ నటిస్తున్నాడు. ‘నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను..’ అని నారా రోహిత్ చెప్పే డైలాగ్ అతడు పడే కష్టాలను తెలియజేస్తుంది.
వయసు ఎంత అంటే జట్టుకు రంగు వేసుకునేంతా అనే డైలాగ్ నవ్విస్తోంది. టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లుగా అర్థమవుతోంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్ తదిరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Kannappa : ‘కన్నప్ప’లో మంచు విష్ణు కొడుకును చూశారా..? అవ్రామ్ స్పెషల్ పోస్టర్ విడుదల