Sunil Gavaskar : జైషా పై ఆరోప‌ణ‌లు.. ఘాటుగా స్పందించిన సునీల్ గ‌వాస్క‌ర్‌..

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌స్తుత ఛైర్మ‌న్‌గా ఉన్న గ్రెగ్ బార్క్‌లే ప‌ద‌వి కాలం న‌వంబ‌ర్‌లో ముగుస్తోంది.

Sunil Gavaskar : జైషా పై ఆరోప‌ణ‌లు.. ఘాటుగా స్పందించిన సునీల్ గ‌వాస్క‌ర్‌..

Sunil Gavaskar blasts perennial cribbers for alleging Jay Shah

Sunil Gavaskar : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌స్తుత ఛైర్మ‌న్‌గా ఉన్న గ్రెగ్ బార్క్‌లే ప‌ద‌వి కాలం న‌వంబ‌ర్‌లో ముగుస్తోంది. మ‌రోసారి ఆ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు బార్క్‌లే సిద్ధంగా లేడు. ఈ క్ర‌మంలో ఐసీసీ త‌దుప‌రి చైర్మ‌న్‌గా బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా బాధ్య‌త‌లు అందుకోవ‌డం లాంఛ‌న‌మే అని ప్ర‌చారం జ‌రుగుతోంది. 16 మంది స‌భ్యుల‌లో 15 మంది మ‌ద్ద‌తు జైషా కు ఉన్న‌ట్లు తెలుస్తోంది. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు నేడే (ఆగ‌స్టు 27) ఆఖ‌రి రోజు. అయితే.. జైషా నామినేష‌న్ దాఖ‌లు విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విష‌యం పై నేడు క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే.. బీసీసీఐ కార్య‌ద‌ర్శి అయిన జైషా పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుత ఛైర్మ‌న్ గ్రెగ్ బార్క్‌ను ప‌ద‌వి నుంచి త‌పుకోవాల‌ని జైషా సూచించిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్, దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించాడు. అవ‌న్నీ నిరాధార‌మైన‌వ‌ని కొట్టి పారేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇక పై త‌మ ఆధిప‌త్యం చెలాయించ‌డానికి వీలు కుద‌ర‌నే ఉద్దేశ్యంలో కొన్ని పాత శ‌క్తులు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

Sanju Samson : రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు సంజూ శాంస‌న్ గుడ్‌బై..? ఆర్ఆర్ పోస్ట్‌..

ఒక వేళ అభ్యంత‌రాలు ఏమైనా ఉంటే.. వాటి గురించి ఐసీసీ స‌మావేశాల్లో ఎందుకు మాట్లాడ‌లేద‌ని ప్ర‌శ్నించాడు. త‌మ వాద‌న‌లు గట్టిగా వినిపించాల్సి ఉంద‌న్నాడు. అయితే.. ఆ స‌మావేశాల్లో వాళ్లు ఎందుకు ఏమీ మాట్లాడ‌లేద‌న్నారు. ఇప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌న్నారు. ఈ ప‌రిస్థితిని ‘టాల్ ఆఫ్ సిండ్రోమ్’ కి ఊదాహ‌ర‌ణ అని విమ‌ర్శించారు.

జైషా ఐసీసీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి అర్హుడ‌న్నారు. భార‌త‌ మెన్స్‌, ఉమెన్స్ క్రికెట్‌లో జ‌రిగిన గొప్ప మార్పులు ప్ర‌పంచ క్రికెట్‌లోనూ జ‌రుగుతాయ‌న్నారు.

Womens T20 World Cup 2024 : క్రికెట్ అభిమానులు సిద్ధం కండి.. అక్టోబ‌ర్ 6న భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. దుబాయ్ వేదిక‌గా

ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ వ్య‌క్తి రెండేళ్ల చొప్పున మూడు సార్లు ఛైర్మ‌న్‌గా ఉండొచ్చు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్ ఇప్ప‌టికే రెండు సార్లు ఛైర్మ‌న్‌గా ఉన్నాడు. మ‌రోసారి అత‌డు ఈ ప‌ద‌వి కోసం పోటీప‌డ‌వ‌చ్చు. అయితే.. త‌న‌కు ఆస‌క్తి లేద‌ని ఇప్ప‌టికే అత‌డు స్ప‌ష్టం చేశాడు. అయితే.. అంత‌ర్జాతీయ మీడియాలో మాత్రం అత‌డు త‌ప్పుకునేలా జైషా ఒత్తిడి చేశాడ‌నే క‌థ‌నాలు వ‌చ్చాయి.