పెను సంచలనం.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి హిస్టరీ క్రియేట్ చేసిన బంగ్లాదేశ్

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ టీమ్ సస్సేషన్ క్రియేట్ చేసింది. తన కంటే ఎంతో బలమైన పాకిస్థాన్ జట్టును సొంత గడ్డపై చిత్తుగా ఓడించి సంచలన విజయాన్ని సాధించింది.

పెను సంచలనం.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి హిస్టరీ క్రియేట్ చేసిన బంగ్లాదేశ్

Bangladesh historic maiden Test win against Pakistan

Updated On : August 25, 2024 / 5:10 PM IST

Bangladesh historic Test win: టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ టీమ్ సస్సేషన్ క్రియేట్ చేసింది. తన కంటే ఎంతో బలమైన పాకిస్థాన్ జట్టును సొంత గడ్డపై చిత్తుగా ఓడించి సంచలన విజయాన్ని సాధించింది. రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ గెలిచింది. సమిష్టి ప్రదర్శనతో బంగ్లాదేశ్.. పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది. అద్భుత బ్యాటింగ్ తో రాణించిన ముష్పికర్ రహీం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 341 బంతుల్లో 22 ఫోర్లు, సిక్సర్ తో 191 పరుగులు చేశాడు.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సాద్ షకీల్(141), మహ్మద్ రిజ్వాన్(171) సెంచరీలు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 565 పరుగులకు ఆలౌటైంది. ముష్పికర్ రహీం(191) కొద్దిలో డబుల్ సెంచరీ కోల్పోగా, షాద్మాన్ ఇస్లాం(93) సెంచరీ మిస్సయ్యాడు. మోమినుల్(50), లిటన్ దాస్(56), హసన్ మిర్వాజ్(77) హాఫ్ సెంచరీలు చేశారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి పాకిస్థాన్‌ 146 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో బంగ్లాదేశ్ 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 2 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ రెండు జట్ల మధ్య సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 30న రావల్పిండిలోనే ప్రారంభమవుతుంది.

Also Read: తండ్రి అయ్యాక మొద‌టి వికెట్‌.. పాకిస్తాన్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది సెల‌బ్రేష‌న్స్ చూశారా..?