Honey Moon Express : హెబ్బా పటేల్ రొమాంటిక్ సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ఓటీటీలోకి..

తాజాగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

Honey Moon Express : హెబ్బా పటేల్ రొమాంటిక్ సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ఓటీటీలోకి..

Hebah Patel Chaitanya Rao Honeymoon Express Movie OTT Details Here

Honey Moon Express : చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. పెళ్లి తర్వాత సమస్యలు వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే కథాంశంతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ తెరకెక్కింది. ఈ సినిమాలో కళ్యాణి మాలిక్ ఇచ్చిన సాంగ్స్ మాత్రం ప్రేక్షకులని మెప్పించాయి.

Also Read : Kiran Abbavaram : సొంతూళ్లో మామిడి తోటలో.. కిరణ్ అబ్బవరం రిసెప్షన్ వేడుకలు..

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేడు ఆగస్టు 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో పర్వాలేదనిపించిన ఈ సినిమా అమెజాన్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. థియేటర్లో మిస్ అయినవాళ్లు ఉంటే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా చూసేయండి.

Hebah Patel Chaitanya Rao Honeymoon Express Movie OTT Details Here