అధికార పక్షంలో ఉన్న మేమే రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని తాను సీఐ లక్ష్మికాంత్ రెడ్డికి ఫోన్ చేస్తే, ‘నీవెవరు నాకు చెప్పడానికి’ అంటూ మాట్లాడారని అస్మిత్ రెడ్డి తెలిపారు.

అధికార పక్షంలో ఉన్న మేమే రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి

అధికార పక్షంలో ఉండి తాము రోడ్డెక్కాల్సి రావడం చాలా బాధాకరమని అనంతపురంలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. పోలీస్టేషన్ ముందు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ శ్రేణులు బైఠాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ… ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని తాను సీఐ లక్ష్మికాంత్ రెడ్డికి ఫోన్ చేస్తే, ‘నీవెవరు నాకు చెప్పడానికి’ అంటూ మాట్లాడారని అస్మిత్ రెడ్డి తెలిపారు. ఒక ప్రజాప్రతినిధికి మర్యాద ఉంటుందని, అది కూడా లక్ష్మికాంత్ రెడ్డికి తెలియదా అని నిలదీశారు. ఒక ఎమ్మెల్యేతోనే సిఐ ఇలా మాట్లాడితే ఇక సామాన్య ప్రజలతో ఎలా మాట్లాడుతారో అర్థం చేసుకోవాలని అన్నారు.

లక్ష్మీకాంత్ రెడ్డిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోకపోతే అన్యాయం జరిగనట్టేనని అస్మిత్ రెడ్డి  చెప్పారు. నియోజక వర్గంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, అరికట్టండని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని అన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను పోలీసులకు తమవాళ్లు పట్టిస్తే తమవాళ్లపైనే కేసులు పెడతానని సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి బెదిరిస్తున్నారని తెలిపారు.

Also Read: జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూలగొడతారా? అధికారులు కొలతలు తీసుకుంది అందుకేనా..