Mahindra Thar Roxx : మారుతి జిమ్నీకి పోటీగా మహీంద్రా థార్ రోక్స్.. ధర, ఫీచర్ల మధ్య తేడాలేంటి?

Mahindra Thar Roxx : థార్ రోక్స్‌లో పెట్రోల్ (2.0-లీటర్ టీజీడీఐ ఎమ్స్ స్టల్లియన్) డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ యూనిట్ 152పీఎస్/330ఎన్ఎమ్, 162పీఎస్/330ఎన్ఎమ్, 177పీఎస్/380ఎన్ఎమ్ ట్యూన్‌లలో పొందవచ్చు.

Mahindra Thar Roxx : మారుతి జిమ్నీకి పోటీగా మహీంద్రా థార్ రోక్స్.. ధర, ఫీచర్ల మధ్య తేడాలేంటి?

Mahindra Thar Roxx vs Maruti Suzuki Jimny ( Image Source : Google )

Mahindra Thar Roxx : మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల భారత మార్కెట్లో కొత్త థార్ రోక్స్‌ను లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో ప్రధాన పోటీదారు మారుతి సుజుకి జిమ్నీకి మరో రెండు బ్రాండ్లు థార్, జిమ్నీ ఉన్నాయి. ఈ రెండు కార్లు ఆఫ్-రోడింగ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. స్పెసిఫికేషన్‌లు (పేపర్‌పై) ధర పరంగా 5-డోర్ జిమ్నీకి పోటీగా 5-డోర్ థార్ రోక్స్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Read Also : Asus AI Laptops : భారత్‌లో అసూస్ కొత్త ఏఐ రెడీ ల్యాప్‌టాప్స్.. అద్భుతమైన ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

థార్ రోక్స్ vs జిమ్నీ: ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ :
థార్ రోక్స్‌లో పెట్రోల్ (2.0-లీటర్ టీజీడీఐ ఎమ్స్ స్టల్లియన్) డీజిల్ (2.2-లీటర్ mHawk) ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ యూనిట్ 152పీఎస్/330ఎన్ఎమ్, 162పీఎస్/330ఎన్ఎమ్, 177పీఎస్/380ఎన్ఎమ్ ట్యూన్‌లలో పొందవచ్చు. అయితే, డీజిల్ యూనిట్ 152పీఎస్/330ఎన్ఎమ్, 175పీఎస్/370ఎన్ఎమ్ ట్యూన్‌లలో లభిస్తుంది.

ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఎటీ టార్క్ కన్వర్టర్ ఉన్నాయి. జిమ్నీ గ్యాసోలిన్ ఇంజిన్‌ను మాత్రమే పొందుతుంది. కె15బీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (105PS/134Nm)ని ఉపయోగిస్తుంది. 5-స్పీడ్ ఎంటీ లేదా 4-స్పీడ్ ఏటీతో ఉండవచ్చు.

థార్ రోక్స్ vs జిమ్నీ డ్రైవ్ సిస్టమ్ :
థార్ రోక్స్‌లో ఆర్‌డబ్ల్యూడీ 4డబ్ల్యూడీ ఆప్షన్లు ఉన్నాయి. అయితే, జిమ్నీలో 4డబ్లూడీ (ఆల్‌గ్రిప్ ప్రో) మాత్రమే ఉంది.

థార్ రోక్స్ vs జిమ్నీ కొలతలు :
థార్ రోక్స్ పొడవు 4,428ఎమ్ఎమ్, వెడల్పు 1,870ఎమ్ఎమ్, ఎత్తు 1,923ఎమ్ఎమ్, 2,850ఎమ్ఎమ్ పొడవైన వీల్‌బేస్‌ని కలిగి ఉంది. అప్రోచ్ యాంగిల్ 41.7-డిగ్రీ, డిపార్చర్ యాంగిల్ 36.1-డిగ్రీ, రాంప్ ఓవర్ యాంగిల్ 23.9-డిగ్రీ కలిగి ఉన్నాయి. జిమ్నీ సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ, 3,985ఎమ్ఎమ్ పొడవు, 1,645ఎమ్ఎమ్ వెడల్పు, 1,720ఎమ్ఎమ్ పొడవు, వీల్‌బేస్ 2,590 మి.మీ ఉంటుంది. అప్రోచ్ యాంగిల్ 36-డిగ్రీ, డిపార్చర్ యాంగిల్ 46-డిగ్రీ, రాంప్ ఓవర్ యాంగిల్ 24-డిగ్రీ కలిగి ఉంటుంది.

థార్ రోక్స్ వర్సెస్ జిమ్నీ ధర ఎంతంటే? :
ప్రస్తుతం మహీంద్రా థార్ రోక్స్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. థార్ రోక్స్ ఆర్‌డబ్ల్యుడి పెట్రోల్ ధర రూ. 12.99 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), అయితే థార్ రోక్స్ ఆర్‌డబ్ల్యుడీ డీజిల్ ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. థార్ రోక్స్ 4డబ్ల్యుడీ ధరలు అక్టోబర్ 3న బుకింగ్‌లు ప్రారంభమయ్యే ముందు ప్రకటించనుంది. జిమ్నీ ధర రూ. 12.74 లక్షలతో మొదలై రూ. 14.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Read Also : Reliance Jio Plans : గుడ్ న్యూస్.. జియో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు!