ఓయో రూమ్స్‌కు వెళ్తున్నారా..! అయితే జాగ్రత్త.. ఈ విషయాలను తెలుసుకోండి..

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఓయో రూమ్స్‌కు వెళ్తున్నారా..! అయితే జాగ్రత్త.. ఈ విషయాలను తెలుసుకోండి..

Hotal Room

OYO Rooms: ప్రముఖ హోటల్ బుకింగ్ ప్లాట్ ఫాం ఓయో బుకింగ్స్ ప్రతీయేటా పెరుగుతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉంది. గతేడాది ఓయో రూమ్స్ బుకింగ్స్ లో దేశంలోని ప్రధాన నగరాలలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా.. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లోని గల్లీల్లో ఉండే భవనాలకు ఓయో హోటల్ బోర్డులు వెలుస్తున్నాయి. మరోవైపు అసాంఘీక కార్యకలాపాలకు ఓయో రూమ్స్ వేదిక అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఓయో రూమ్స్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొందరు ఓయో హోటల్ నిర్వాహకులు నీచమైన పనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

 

రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకుడు నీచమైన పనికి పాల్పడ్డాడు. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి, వాటిని అడ్డుపెట్టుకొని బాధితులను హోటల్ నిర్వాహకుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తద్వారా అందినకాడికి డబ్బులు దండుకుంటున్నాడు. అదే ఓయో హోటల్ లో రూమ్ ను ఓ జంట బుక్ చేసుకుంది. ఆ రూమ్ లో ఒకరోజు ఆ జంట ఉంది. హోటల్ నిర్వాహకుడు రహస్య సీసీ కెమెరా ద్వారా హోటల్ గదిలో వారు ఉన్న వీడియోను సేకరించి వారిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సదరు హోటల్ లో తనిఖీలు చేయగా.. రహస్య సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు.

 

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్జె ఎయిర్ పోర్టు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓయో హోటల్స్ కు వెళ్లిన వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.