Hyderabad : సంపన్నుల నగరంగా హైదరాబాద్.. కుబేరుల జాబితాలో దేశంలో మూడో స్థానం మనదే..

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2024 జాబితా ప్రకారం.. దేశంలోనే ఎక్కువ మంది సంపన్నులున్న నగరాల జాబితాలో హైదరాబాద్..

Hyderabad : సంపన్నుల నగరంగా హైదరాబాద్.. కుబేరుల జాబితాలో దేశంలో మూడో స్థానం మనదే..

Hyderabad

Indias Richest Person : దేశంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా మళ్లీ ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2024 తాజాగా వెల్లడించిన జాబితాలో అదానీ తరువాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ నిలిచారు. అదానీ నికర సంపద విలువ ఏడాదికాలంలో 95శాతం పెరిగింది. దీంతో ఆయన సంపద రూ. 11.6లక్షల కోట్లకు చేరింది. ముకేశ్ అంబానీ నికర విలువ 25శాతం వృద్ధితో రూ.10.14లక్షల కోట్లకు చేరింది. తొలిసారి ఈ జాబితాలో అనేక మంది పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు చేరారు. బాలీవుడ్ ప్రముఖుల్లో షారూక్ ఖాన్, జూహి చావ్లా, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్ లు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ – 2024 జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Also Read : Gautam Adani : భారత అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. హురున్ జాబితాలో అగ్రస్థానం.. ముఖేష్ అంబానీకి రెండో స్థానం!

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 జాబితా ప్రకారం.. భారతదేశంలో అత్యధిక సంపన్నులు కలిగిన నగరాల్లో హైదరాబాద్ దూసుకెళ్తుంది. దేశంలోనే ఎక్కువ మంది సంపన్నులున్న నగరాల జాబితాలో.. మొదటి స్థానంలో ముంబయి (386 మంది) నిలవగా.. ఢిల్లీ (217 మంది) రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో హైదరాబాద్ నగరం నిలిచింది. హైదరాబాద్ లో 104 మంది సంపన్నులు ఉన్నారు. కుబేరుల జాబితాలో 17మందికొత్తగా హైదరాబాద్ నుంచే చేరడం గమనార్హం. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ – 2024 జాబితాలో చిన్నవయస్సు కలిగిన కుబేరుల జాబితాలో హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త చోటు దక్కించుకున్నారు. అతనే.. రాఘవ కన్ స్ట్రక్షన్ కు చెందిన హర్షరెడ్డి పొంగులేటి (30). రాఘవ కన్ స్ట్రక్షన్ నికర ఆదాయం రూ. 1300 కోట్లు.

Also Read : Triumph Daytona 660 : ట్రయంఫ్ డేటోనా 660 సరికొత్త బైక్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 జాబితా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో టాప్ -10 సంపన్నులు వీరే..
మురళీ దివి, కుటుంబం (దివీస్ లేబొరేటరీస్) : రూ.76,100 కోట్లు
పి. పిచ్చిరెడ్డి (మేఘా ఇంజనీరింగ్) : రూ. 54,800 కోట్లు.
పీవీ కృష్ణారెడ్డి (మేఘా ఇంజినీరింగ్) : రూ. 52,700 కోట్లు.
బి. పార్థసారధి రెడ్డి, కుటుంబం (హెటెరో ల్యాబ్స్) : రూ. 29,900 కోట్లు.
ఎస్. సుబ్రమణ్యం రెడ్డి (అపర్ణ కన్ స్ట్రక్షన్స్) : రూ. 22,100 కోట్లు.
సి. వెంకటేశ్వర రెడ్డి (అపర్ణ కన్ స్ట్రక్షన్స్) : రూ. 21,900 కోట్లు.
ఎం. సత్యనారాయణ రెడ్డి, కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబ్స్) : రూ. 18,500 కోట్లు.
జూపల్లి రామేశ్వర్ రావు కుటుంబం (మైహోమ్ ఇండస్ట్రీస్) : రూ. 18,400 కోట్లు.
కె. సతీశ్ రెడ్డి కుటుంబం (డాక్టర్ రెడ్డీస్) : రూ. 18,100 కోట్లు.
మహిమ దాట్ల కుటుంబం (బయోలాజికల్ ఇ) : రూ. 13,600 కోట్లు.