Global Bio Conference : హైదరాబాద్ గ్లోబల్ బయో ఇండియా సదస్సు

Global Bio Conference : గ్లోబల్ బయో ఇండియా 2024 సదస్సులో పాల్గొన్న ఆయన.. వ్యవసాయలో వచ్చే నూతన ఆవిష్కరణల్లో  ఏఐ సహా ఆధునిక సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

Global Bio Conference : హైదరాబాద్ గ్లోబల్ బయో ఇండియా సదస్సు

Hyderabad Global Bio India Conference

Global Bio Conference : భవిష్యత్ తరాల  కోసం ఆహారం, నేల, నీరు వృథా కాకుండా కాపాడాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు వెంచర్‌ క్యాపిటలిస్టు, పారిశ్రామికవేత్త అభి ముఖర్జీ. జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య విద్యాసంస్థ నిర్వహించిన గ్లోబల్‌ బయో ఇండియా -2024 సదస్సులో పాల్గొన్న ఆయన వ్యవసాయంలో బయోటెక్‌ కీలకపాత్ర పోషిస్తోందని, దాన్ని మరింత అనుసంధానం చేసి.. అంకురాలను పెద్దఎత్తున ప్రోత్సహించాలన్నారు. ఈ సదస్సులో పలు స్టార్టప్‌లు కంపెనీలు పాల్గొన్నాయి.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ఆహారం, నీరు, నేల, వాతావరణం, రైతు అనేవి భూమిని సమృద్ధిగా, నిలకడగా ఉంచడానికి ఐదు ప్రధాన అంశాలు. భవిష్యత్ తరాల మనుగడ కోసం వీటిని కాపాడాలని వెంచర్‌ క్యాపిటలిస్టు, పారిశ్రామికవేత్త అభి ముఖర్జీ అన్నారు. ఇటీవల హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ పరిశోధన యాజమాన్య విద్యాసంస్థ లో నిర్వహించిన గ్లోబల్ బయో ఇండియా 2024 సదస్సులో పాల్గొన్న ఆయన.. వ్యవసాయలో వచ్చే నూతన ఆవిష్కరణల్లో  ఏఐ సహా ఆధునిక సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

దీంతో పాటే బయోటెక్‌ కీలకం కానుందని సూచించారు. ఇందుకోసం స్టార్టప్ రంగంలోని సవాళ్లను ఎదుర్కోని పురోగతిని సాధించడానికి ప్రభుత్వాలు, వ్యాపారాలు , ఆవిష్కర్తల మధ్య సహకారం కావాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ సదస్సులో బయో-ఫార్మా, బయో-అగ్రి, బయో-ఇండస్ట్రియల్, బయో-ఎనర్జీ, బయో-సర్వీసెస్, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు, విద్యార్థులు, అధ్యాపకులు శాస్త్రవేత్తలు సహా వివిధ రంగాలకు చెందిన 196 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు