Sigatoka Disease : అరటిని నష్టపరుస్తున్న సిగటోకా, పనామా తెగుళ్లు – నివారణకు శాస్రవేత్తల సూచనలు

Sigatoka Disease : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్లతోటల్లో అరటి ప్రధానమైంది. ఒకసారి నాటితే 3 సంవత్సరాల వరకు రైతులు గెల దిగుబడి తీస్తున్నారు.

Sigatoka Disease : అరటిని నష్టపరుస్తున్న సిగటోకా, పనామా తెగుళ్లు – నివారణకు శాస్రవేత్తల సూచనలు

Sigatoka Disease In Banana

Sigatoka Disease : అరటి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోను రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య సిగటోక ఆకుమచ్చ తెగులు. మొక్క దశనుండి గెలకోత వరకు ఈ తెగులు బెడద వెంటాడుతోంది. వీటితోపాటు తరచూ దుంపకుళ్లు, పనామా తెగుళ్లు దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి కడప జిల్లా అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. నాగలక్ష్మి రైతాంగానికి తెలియజేస్తున్నారు.

Read Also :  Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్లతోటల్లో అరటి ప్రధానమైంది. ఒకసారి నాటితే 3 సంవత్సరాల వరకు రైతులు గెల దిగుబడి తీస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా తోటల్లో చీడపీడల బెడద ఎక్కువవటంతో రైతులు ఒకటి రెండు పంటలకే తోటలను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రధానంగా సిగటోక ఆకుమచ్చ, పనామా, దుంపకుళ్లు వంటి సమస్యలు తోటలను వెన్నాడుతున్నాయి. అధిక సాంద్ర పధ్దతిలో మొక్కలు నాటిన తోటల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా వుంది. తోటల్లో కలుపు లేకుండా చూసుకుని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ తెగుళ్లను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు కడపజిల్లా అనంతరాజుపేట ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. నాగలక్ష్మి.

అరటి తోటలను ఆశించే  తెగుళ్లలో అతి ప్రమాధకరమైన తెగుళ్లు  పనామా, దుంపకుళ్లు తెగుళ్లు. బాక్టీరియా, శిలీంధ్రాల ద్వారా ఆశించే ఈ తెగుళ్ల వల్ల ఒక్కోసారి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Read Also : Fruit Fly : ఆగాకరలో పండుఈగ ఉధృతి – సమగ్ర సస్యరక్షణ చర్యలతోనే నివారణ సాధ్యం