Mokshagnya : బాలయ్య తనయుడు మోక్షజ్ఞకు అప్పుడే ఆ స్టార్ ట్యాగ్ ఇస్తారా? మొదటి సినిమాకే..?

మోక్షజ్ఞకు కూడా మొదటి సినిమా నుంచే ఒక ట్యాగ్ ఇస్తారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Mokshagnya : బాలయ్య తనయుడు మోక్షజ్ఞకు అప్పుడే ఆ స్టార్ ట్యాగ్ ఇస్తారా? మొదటి సినిమాకే..?

Balakrishna Son Nandamuri Mokshagnya will get New Star Tag Rumours goes Viral

Nandamuri Mokshagnya : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుంది. అయితే మన హీరోలకి సినిమా టైటిల్స్ లో వాళ్ళ పేర్ల ముందు ఏదో ఒక స్టార్ ట్యాగ్ ఉండాల్సిందే.

నందమూరి ఫ్యామిలిలో బాలకృష్ణకు గతంలో యువరత్న, నటసింహం, ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ అని ట్యాగ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ కు కూడా గతంలో యంగ్ టైగర్, A1 స్టార్, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ట్యాగ్స్ ఉన్నాయి. అయితే మోక్షజ్ఞకు కూడా మొదటి సినిమా నుంచే ఒక ట్యాగ్ ఇస్తారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Also See : Balakrishna : అల్లుడితో కలిసి బాలకృష్ణ వినాయక చవితి పూజలు.. ఫొటోలు వైరల్..

మన స్టార్ హీరోల వారసులకు కూడా ట్యాగ్స్ ఇస్తారని తెలిసిందే. రామ్ చరణ్ కి కెరీర్ మొదట్లోనే మెగా పవర్ స్టార్ అని ఇచ్చారు. అలా ఇప్పుడు మోక్షజ్ఞకు జూనియర్ నటసింహం అనే ట్యాగ్ ఇస్తారని టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. అయితే మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే ట్యాగ్ ఇస్తారా? ప్రశాంత్ వర్మ ట్యాగ్ పెట్టనిస్తాడా? బాలకృష్ణ కానీ అభిమానులు కానీ మోక్షజ్ఞకి ట్యాగ్ ఇవ్వమని అడుగుతారా చూడాలి. ఒకవేళ మోక్షజ్ఞకి ట్యాగ్ ఇస్తే జూనియర్ నటసింహం అనే ట్యాగ్ ఇస్తారా లేక ఇంకేదైనా కొత్త ట్యాగ్ ఇస్తారా చూడాలి మరి.

Image