Brunei Sultan : బ్రూనైలో ప్రధాని మోదీ పర్యటన.. ఆతిథ్యమివ్వనున్న 7వేల లగ్జరీ కార్ల రారాజు సుల్తాన్..!

Brunei Sultan : యూకే క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన రెండో చక్రవర్తి సుల్తాన్ హస్సనల్ బోల్కియాగా పేరొంది. ఈ బ్రిటన్ రాజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటించనున్నారు.

Brunei Sultan : బ్రూనైలో ప్రధాని మోదీ పర్యటన.. ఆతిథ్యమివ్వనున్న 7వేల లగ్జరీ కార్ల రారాజు సుల్తాన్..!

Sultan Of Brunei, Owner Of Over 7,000 Cars, Will Welcome PM Modi Today

Updated On : September 3, 2024 / 4:34 PM IST

Brunei Sultan : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మంగళవారం) బ్రూనై చేరుకోనున్నారు. ఆగ్నేయాసియా దేశానికి భారత ప్రధాని తొలిసారిగా పర్యటించడం ఇదే తొలిసారి. బ్రూనైతో 40 ఏళ్ల దౌత్య సంబంధాల సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ రెండు రోజుల పర్యటన కొనసాగనుంది.

Read Also : Viral video : వీడెవడండీ బాబు.. విమానం పైల‌ట్టా, లారీ క్లీనరా..?

యూకే క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన రెండో చక్రవర్తి సుల్తాన్ హస్సనల్ బోల్కియాగా పేరొంది. ఈ బ్రిటన్ రాజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటించనున్నారు. హస్సనల్ బోల్కియా అత్యంత సంపన్నుడిగా విలసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్లను కూడా కలిగి ఉన్నారు. ఈ లగ్జరీ కార్ల విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు (రూ. 4 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. ఆయన సంపాదనలో ఎక్కువగా బ్రూనై చమురు, గ్యాస్ నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ వద్ద 7వేలకు పైగా లగ్జరీ వాహనాలు ఉన్నాయి.

అందులో సుమారు 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. ఇదే ఆయనకు అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సంపాదించిపెట్టింది. ది సన్ ప్రకారం.. దాదాపు 450 ఫెరారీలు, 380 బెంట్లీలు ఉన్నాయి. నివేదికల ప్రకారం.. హస్సనల్ బోల్కియా గ్యారేజీలో పోర్షెస్, లంబోర్ఘినిస్, మేబ్యాక్స్, జాగ్వార్‌లు, బీఎండబ్ల్యూ, మెక్‌లారెన్స్‌లను కూడా ఉన్నాయి.

అత్యంత ముఖ్యమైన లగ్జరీ కార్లలో బెంట్లీ డామినేటర్ ఎస్ యూవీ ఒకటి. దీని విలువ సుమారు 80 మిలియన్ డాలర్లు, పోర్షే 911 హారిజన్ బ్లూ పెయింట్, ఎక్స్88 పవర్ ప్యాకేజీ, 24-క్యారెట్ బంగారు పూతతో కూడిన రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్ ఉన్నాయి. ఆయన అత్యంత విలువైన కార్లలో ఇదొకటి. ఓపెన్ రూఫ్, కస్టమ్-డిజైన్ రోల్స్ రాయిస్, బంగారంతో రూపొందించారు. సుల్తాన్ 2007లో తన కుమార్తె ప్రిన్సెస్ మజిదేదా వివాహం కోసం కస్టమ్ గోల్డ్-కోటెడ్ రోల్స్ రాయిస్‌ను కూడా కొనుగోలు చేశారు.

సుల్తాన్ ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఈ ప్యాలెస్ రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం 22 క్యారెట్ల బంగారంతో అలంకరించారు. ఈ ప్యాలెస్‌లో 5 స్విమ్మింగ్ పూల్స్, 1,700 బెడ్‌రూమ్‌లు, 257 బాత్‌లు, 110 గ్యారేజీలు ఉన్నాయి. సుల్తాన్‌కు ప్రైవేట్ జూ పార్క్ కూడా ఉంది. ఇందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్షి జాతులు ఉన్నాయి. ఆయనకు బోయింగ్ 747 విమానం కూడా ఉంది.

Read Also : Viral Video : బిలియనీర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. అభిమాని కోసం లక్షల ఖరీదైన వాచ్.. వీడియో!