ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపుపై కన్నయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు..

డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపుపై కన్నయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు..

Boats In Prakasam Barrage (Photo Credit : Google)

Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతుండటంతో గేట్లను పరిశీలించారాయన. సాగు ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు కన్నయ్యనాయుడితో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గేట్ల దగ్గర అడ్డు పడిన బోట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన చేశారు. గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడిని అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు… కృష్ణా నది ప్రవాహంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తోందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. కౌంటర్ వెయిట్ల నిర్మాణంలో కృషి చేసిన వారిని చంద్రబాబు ప్రశంసించారు.

డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగిస్తామన్నారు. అయితే అది కష్టంతో కూడుకున్నది ఆయన వివరించారు.

అటు, విజయవాడ వరద విపత్తులో గతంలో ఎదురవని ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న తెలిపారు. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో వరద అనేది మూడు రోజులు మాత్రమే ఉంటుందన్నారు. కానీ ఇక్కడ 8 రోజులు ఉండటం తొలిసారి చూస్తున్నామన్నారు. విజయవాడ వరదలు మాకు కొత్త పాఠాన్ని నేర్పాయన్నారు ప్రసన్న. మాకు ఎదురైన సవాళ్లను భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలా అధిగమించాలో కార్యాచరణ రూపొందించుకుంటామని వెల్లడించారు. 20వేల మందికి పైగా వరద బాధితులని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. మొత్తం 23 బృందాలు పని చేశాయన్నారు. ప్రస్తుతానికి వరద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న.

Also Read : బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్.. : మంత్రి లోకేశ్

విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేటలో వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. బాధితుల ఇంటికి వెళ్లారు మంత్రి నారాయణ. ఇళ్లలో నీరు ఎక్కడి వరకు ప్రవేశించిందో స్వయంగా పరిశీలించారు మంత్రి నారాయణ. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు వరద నీటిలో పలు ఇళ్లను మంత్రి నారాయణ పరిశీలించారు.

”వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉంది. రేపు సాయంత్రానికి ఓల్డ్ ఆర్.ఆర్ పేటలో నీరు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఖాళీ స్థలాల్లో నీరు నిలువ ఉన్న చోట్ల మోటార్లతో తోడేస్తున్నాం. వరద తగ్గిన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన పారిశుధ్య పనులు జరుగుతున్నాయి” అని మంత్రి నారాయణ తెలిపారు.