Aswathama Ganesh Idol : కల్కి సెట్టు.. ‘అశ్వత్థామ’ వినాయకుడు.. అది కూడా తమిళనాడులో..

తాజాగా అశ్వత్థామ వినాయక విగ్రహం వైరల్ గా మారింది.

Aswathama Ganesh Idol : కల్కి సెట్టు.. ‘అశ్వత్థామ’ వినాయకుడు.. అది కూడా తమిళనాడులో..

Aswathama Ganesh Idol in Tamilanadu with Kalki Movie Set Videos goes Viral

Aswathama Ganesh Idol : దేశమంతా వినాయక చవితిని గ్రాండ్ గా చేసుకున్నారు. వినాయక నవరాత్రులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వినాయకచవితికి కొత్త కొత్త ఆకారంలో ఉన్న వినాయక విగ్రహాలు పెడతారు చాలా మంది. కొంతమంది మన హీరోల సినిమాల్లోని క్యారెక్టర్స్ తో వినాయక విగ్రహాలు పెడుతున్నారు. గతంలో బాహుబలి వినాయకుడు, పుష్ప వినాయకుడు విగ్రహాలు రాగా ఈసారి సలార్, దేవర, పుష్ప వినాయక విగ్రహాలు వచ్చాయి. అయితే తాజాగా మరో వినాయక విగ్రహం వైరల్ గా మారింది.

ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించగా ఈ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాలో ప్రభాస్ వాడిన బుజ్జి వెహికల్ కూడా బాగా వైరల్ అయింది. అయితే ఓ వినాయక మండపంలో కల్కి సెట్ వేసి, కాంప్లెక్స్ లాంటి ఎంట్రీ పెట్టి బయట ప్రభాస్ వెహికల్ లాగే డిజైన్ చేసి, ఎంట్రీలో కమల్ హాసన్ పాత్ర బొమ్మ పెట్టి లోపల శివుడి విగ్రహం పక్కన అశ్వత్థామ పాత్రలో వినాయకుడు ఉన్నట్టు విగ్రహం పెట్టారు.

Also Read : Priyadarshi : గేమ్ ఛేంజర్, బలగం ఒకేసారి షూటింగ్స్ జరిగాయి.. అక్కడా ఇక్కడా చేసేవాడ్ని..

దీంతో ఈ అశ్వత్థామ వినాయక విగ్రహం వైరల్ గా మారింది. ఈ విగ్రహం పెట్టింది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడు రాష్ట్రంలో డెంకన్ కొట్టాయి అనే ఊళ్ళో ఈ కల్కి సెట్, అశ్వత్థామ వినాయక విగ్రహం పెట్టారు. దీంతో ఈ సెట్, వినాయక విగ్రహం వైరల్ గా మారాయి. మీరు కూడా కల్కి సెట్, అశ్వత్థామ వినాయకుడి వీడియో చూసేయండి..