ICICI Prudential Life : తెలుగు రాష్ట్రాల వరద బాధిత కుటుంబాలకు క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రాసెస్ చాలా ఈజీ!

ICICI Prudential Life : వరద బాధిత కుటుంబాలకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించే దిశగా డెత్ క్లెయిమ్‌లను వేగవంతంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది.

ICICI Prudential Life : తెలుగు రాష్ట్రాల వరద బాధిత కుటుంబాలకు క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రాసెస్ చాలా ఈజీ!

ICICI Prudential Life eases claims settlement process for families

ICICI Prudential Life : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదల బారిన పడిన వ్యక్తుల నామినీలు/లబ్ధిదారుల కోసం క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సులభతరం చేసింది. వరద బాధిత కుటుంబాలకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించే దిశగా డెత్ క్లెయిమ్‌లను వేగవంతంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)లో భాగమైన వాటితో పాటు అన్ని క్లెయిమ్‌లు కేవలం మూడు (3) ప్రాథమిక డాక్యుమెంట్ల ఆధారంగా ప్రాసెస్ చేయనుంది.

Read Also : Vivo T3 Ultra Launch : అదిరే ఫీచర్లతో వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ చూశారా? భారత్‌లో ధర ఎంతో తెలుసా?

క్లెయిమ్‌ కోసం నామినీలు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు :
ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌తో బ్యాంకు అకౌంటు నంబరు లేదా బ్యాంక్ అకౌంటు క్యాన్సిల్డ్ చెక్కు కాపీ స్థానిక మున్సిపల్ అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం. ఒకవేళ డెత్ సర్టిఫికెట్ లేకపోతే ఆస్పత్రులు, ప్రభుత్వాధికారులు లేదా పోలీసులు జారీ చేసిన మృతుల జాబితానైనా నామినీలు సమర్పించవచ్చు. పాన్ కార్డు/ఫారం 60 వంటి చెల్లుబాటయ్యే కేవైసీ డాక్యుమెంట్లు, రీసెంట్ ఫొటో, ఏదైనా అధికారిక డాక్యుమెంట్లు (ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడీ, NREGA జాబ్ కార్డు లేదా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జారీ చేసిన లెటర్) వంటివి ఉండాలి.

క్లెయిమ్ సంబంధ సందేహాలేవైనా ఉంటే నివృత్తి కోసం కంపెనీకి చెందిన 24X7 క్లెయిమ్ కేర్ హెల్ప్‌లైన్ నంబరు 1800-2660కి నామినీలు/లబ్ధిదారులు కాల్ చేయొచ్చు. ప్రత్యామ్నాయంగా తమ క్లెయిమ్‌లను claimsupport@iciciprulife.com మెయిల్ చేయొచ్చు లేదా ICLAIM <space> పాలసీ నంబరు రాసి 56767కి SMS చేయొచ్చు లేదా www.iciciprulife.com/claims లింక్ ద్వారా వెబ్‌సైట్ విజిట్ చేయొచ్చు.

“ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. వరద బాధిత మృతుల కుటుంబాలకు డెత్ క్లెయిమ్‌లన్నింటిని కేవలం 3 ప్రాథమిక డాక్యుమెంట్ల ప్రాతిపదికన వేగవంతంగా సెటిల్ చేస్తాం. క్లెయిమెంట్లపై ఏమైనా సందేహాలు ఉంటే మా 24X7 క్లెయిమ్‌కేర్ హెల్ప్‌లైన్ 1800-2660కి కాల్ చేయొచ్చు.

అలాగే, క్లెయిమెంట్లు తమ క్లెయిమ్‌లను తెలిపేందుకు మా డిజిటల్ టూల్స్ మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు లేదా SMS పంపించవచ్చు” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అమీష్ బ్యాంకర్ పేర్కొన్నారు.

Read Also : iPhone 16 Series Launch : ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ కావాలా? ఈ నెల 13 నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.. ధరల వివరాలివే..!