దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు : రానా, మిహికా బజాజ్ పెళ్లి సందడి..ఫొటోలు

  • Published By: madhu ,Published On : August 8, 2020 / 02:13 PM IST
దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు : రానా, మిహికా బజాజ్ పెళ్లి సందడి..ఫొటోలు

దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వీరి వివాహ ఏర్పాట్లతో సందడి సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు రామానాయుడు స్టూడియోను అందంగా ముస్తాబు చేశారు. 2020, ఆగస్టు 08వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తానికి మిహికా మెడలో ‘బాహుబలి’ స్టార్ రానా మూడు ముళ్లు వేయనున్నారు.



ఇప్పటికే వివాహ వేడుకలు ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి. తమ అభిమాన నటుడు రానా..వివాహం జరుగుతుండడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెడీ అంటూ..రానా ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తోంది. తండ్రి సురేష్ బాబు, బాబాయ్ వెంకటేష్ లు సంప్రదాయ పద్ధతిలో వస్త్రాలు ధరించారు. ఈ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. హ్యపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వన్స్డ్ అంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.



పెళ్లికి ముందు…నిర్వహంచే సంప్రదాయబద్ధంగా నిర్వహంచే హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. ఇక…కరోనా నేపథ్యంలో రానా, మిహికాకు సంబంధించిన సన్నిహితులు, కొద్ది మంది అతిథుల మధ్య వివాహం జరుగనుంది.

పెళ్లికి హాజరయ్యే ప్రతొక్కరూ..కోవిడ్ -19 పరీక్షలు చేయించుకుంటారని, పెళ్లి వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేగాకుండా భౌతిక దూరం పాటిస్తామని వరుడి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు వెల్లడించారు.



దగ్గుబాటి రానా-మిహీకా బజాబ్ ఆగస్టు 8న పెళ్లి జరుగనుందని కుటుంబ సభ్యులు 2020, జూన్ 10వ తేదీన అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. పెళ్లి తంతు మూడు రోజుల పాటు నిర్వహించారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరిగాయి. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించబోతున్నారు.

రానా దగ్గుబాటి కొద్ది రోజుల క్రితం తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా లేకపోతే..సంబరాలు వేరేగా ఉండేవి. కరోనా లాక్ డౌన్ తర్వాత..గ్రాండ్ గా వివాహం జరపాలని దగ్గుబాటి ఫ్యామిలీ ఆలోచిస్తోందని సమాచారం.



సో..మొత్తానికి..దగ్గుబాటి వారసుడు, టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి పెళ్లిపీటలు ఎక్కనున్నాడు.