తెలంగాణలో 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

  • Published By: bheemraj ,Published On : August 15, 2020 / 10:52 PM IST
తెలంగాణలో 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1863 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క‌రోజే 21, 239 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో 1863 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు క‌రోనా కేసుల సంఖ్య 90,259కి చేరుకుంది. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 1,912 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుగా, 10 మంది మృతి చెందారు.



ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనాతో 684 మంది మ‌ర‌ణించారు. 66,196 మంది కోలుకోగా, 23,376 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 16,221 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. రాష్ట్రంలో మ‌ర‌ణాల రేటు 0.75 శాతం ఉంది. కరోనా నుంచి కోలుకున్న‌వారి శాతం 73.34గా ఉంది.

నిన్న న‌మోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 394, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 175, రంగారెడ్డి జిల్లాలో 131, క‌రీంన‌గ‌ర్లో 104, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 101, రాజ‌న్న సిరిసిల్ల 90, సంగారెడ్డి 81, ఖ‌మ్మం 61, , జ‌గిత్యాల 61, సిద్దిపేట 60, గ‌ద్వాల జిల్లాలో 58, న‌ల్ల‌గొండ 49, వ‌రంగ‌ల్ రూర‌ల్ 41, పెద్ద‌ప‌ల్లి 40, నిజామాబాద్ 39, కొత్త‌గూడెం 36, మెద‌క్ 36, జ‌న‌గామా 34, సూర్యాపేట 33, కామారెడ్డిలో 31 కేసులు నమోదు అయ్యాయి.



నిర్మ‌ల్ 28, వ‌న‌ప‌ర్తి 26, నాగ‌ర్ క‌ర్నూల్ 24, ఆదిలాబాద్‌లో 18, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 18, వికారాబాద్ 16, యాదాద్రి భువ‌న‌గిరి 15, మ‌హ‌బూబాబాద్ 14, ములుగు 13, ఆసిఫాబాద్ 12, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లిలో 12, మంచిర్యాల 7, నారాయ‌ణ‌పేట 5 చొప్పున న‌మోద‌య్యాయి.