Papaya : బొప్పాయిలో సూక్ష్మ పోషకాల లోపం, నివారణా చర్యలు !

ఎరువులను చెట్టు వయస్సు పెరిగే కొలది చెట్లు చుట్టూ చిన్నగాడి తీసి అందులో వేసి మట్టి కప్పి వెంటనే నీరివ్వాలి. రెండవ, మూడవ సంవత్సరాలలో సూపర్‌ ఫాస్ఫేట్‌ మోతాదు సగానికి తగ్గించి పై ఎరువుల్ని అదే మోతాదులో రెండు మాసాలకొకసారి అందించాలి. దీనితోపాటుగా 50 గ్రా. ఫాస్ఫోబాక్టీరయాను ఏడాదికి ఒకసారి పశువుల ఎరువుతో కలిపి వేయాలి.

Papaya : బొప్పాయిలో సూక్ష్మ పోషకాల లోపం, నివారణా చర్యలు !

Deficiency of micronutrients in papaya, preventive measures!

Papaya : బొప్పాయి సాగులో భారతదేశం ప్రధమ స్థానంలో ఉన్నది. తెలుగు రాష్ట్రాలలో బొప్పాయిని కడవ, అనంతపురం, చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగుచేన్తున్నారు. తెలంగాణలో. మెదక్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి మరియు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు.

బొప్పాయిలో పోషక విలువలు విరివిగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్‌, ఖనిజ లవణాలు, పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిని అనేక బెషధాలలో కూడా వాడతారు. బొప్పాయి పాల నుండి తీయబడిన పపయిన్‌ అనే ఎంజైమ్‌ను అనేక పరిశ్రమలలో మరియు మందుల తయారీలో వాడుతున్నారు.

బొప్పాయిని ఒకసారి నాటిన తరువాత, తొమ్మిది నెలల నుండి. రెండు నంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిస్తుంది. మంచి దిగుబడులు సాధించాలి అంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా బొప్పాయిలో నుస్థిర నాణ్యమైన అధిక దిగుబడులకు సమతుల్య సమగ్రమైన ఎరువులను ఉపయోగించాలి.

ఎరువులను చెట్టు వయస్సు పెరిగే కొలది చెట్లు చుట్టూ చిన్నగాడి తీసి అందులో వేసి మట్టి కప్పి వెంటనే నీరివ్వాలి. రెండవ, మూడవ సంవత్సరాలలో సూపర్‌ ఫాస్ఫేట్‌ మోతాదు సగానికి తగ్గించి పై ఎరువుల్ని అదే మోతాదులో రెండు మాసాలకొకసారి అందించాలి. దీనితోపాటుగా 50 గ్రా. ఫాస్ఫోబాక్టీరయాను ఏడాదికి ఒకసారి పశువుల ఎరువుతో కలిపి వేయాలి.

సూక్ష్మపోషక లోపాలు, సవరణ :

మొక్కకు సూక్ష్మపోషకాలు చాలా తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ వాటి లోపం వలన పండ్ల నాణ్యత లోపించడం, దిగుబడులు తగ్గడం, పండు నిల్వ సామర్థ్యం లోపించడం జరుగుతుంది.

జింకు ధాతు లోపం : ఆకుల ఈనెలు, ఈనెలకు అనుకొనియున్న కణజాలం, ఆకుపచ్చ రంగుతోను, ఈనెల మధ్యభాగం పసుపు లేదా పాలిపోయినట్లు ఉంటుంది. పిందె అంతగా కట్టదు. కాయ సైజు, నాణ్యత రుచి తగ్గుతుంది. సవరణకు లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేట్‌ + 10 గ్రా. యూరియా కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారి చేయాలి.

మెగ్నీషియం ధాతులోపం : ఆకులోని ప్రధాన ఈనెకు ఇరువైపుల తిరగబడిన , లేదా ఈటె ఆకారంలో ఆకుపచ్చ రంగు ఉండి, మిగతా భాగమంతా పేలవంగా మారుతుంది. సవరణకు లీటరు నీటికి 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ + 10 గ్రా. యూరియా కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారి చేయాలి.

ఇనుపథాతు లోపం : ఆకుల ఈనెలు లేత ఆకుపచ్చ రంగులోను, ఈనెల మధ్య భాగం తెల్లగా మారుతుంది. లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు, ఈనెల మధ్యభాగం పూర్తిగా తెలుపుకు మారుతుంది. అందువలన దీనిని బ్లీచింగ్‌ అంటారు. దీనిలోప సవరణకు లీటరు నీటికి 2గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ + 1 గ్రా. నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని చెట్టుపై పిచికారి చేయాలి.

బోరాన్‌ ధాతు లోపం : ఆకులు జీవం కోల్పోయి, కళావిహీనంగా. ఉంటాయి. పిందె తక్కువగా కట్టడం, పిందె రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాయలపై కంతుల మాదిరి ఏర్పడతాయి. కండ లోపల అక్కడక్కడ గడ్డ మాదిరి ఏర్పడతాయి. పండు నాణ్యత కోల్పోతుంది. ఈ లోపం కన్పించిన కాయలకు మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది.

సాధారణంగా ఒకే తోటలో రకరకాల సూక్ష్మధాతు లోపాలు కనపడుతూ ఉంటాయి. అందువలన మొక్క 3-4 నెలల వయస్సు ఉన్నప్పుడు సూక్ష్మధాతు మిశ్రమ ద్రావణాన్ని మొక్కలపై పిచికారి చేస్తూ ఉండాలి. జింకుసల్ఫేట్‌ -5గ్రా. , మెగ్నీషియం -2గ్రా., మాంగనీస్‌ సల్ఫేట్‌ – 2గ్రా., ఫెర్రస్‌ సల్ఫేట్‌ -2గ్రా., బోరాక్స్‌ -2గ్రా. కాల్షియం -6గ్రా., యూరియా -10గ., నీరు -1లీటరు ప్రతి 10 లీటర్ల మందు ద్రావణానికి 5 మి.లీ. సాండోవిట్‌ జిగురు కలిపితే మందుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.