Mango Farming : మామిడిసాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు

రైతు సింహాద్రి శ్రీనివాసరావు తనకున్న 4 ఎకరాల్లో ఉద్యానశాఖ అధికారుల సహకారంతో 12 ఏళ్ల క్రితం బంగినపల్లి మామిడి మొక్కలను నాటారు. నాటిన 3 ఏళ్లనుండి పంట దిగుబడులను పొందుతున్నారు.

Mango Farming : మామిడిసాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు

Mango Farming

Mango Farming : ప్రపంచ ప్రఖ్యాత చెందిన మామిడి రకాల్లో బంగినపల్లి ఒకటి. మార్కెట్లో కనిపిస్తే ఎప్పుడు తినేద్దామా అనిపించని రోజనుండదు. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండే బంగినపల్లి మామిడి రుచి ప్రత్యేకమైంది. ఈ పండకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి మామిడిని 4 ఎకరాల్లో సాగుచేస్తూ.. 10 ఏళ్లుగా మంచి దిగుబడులను తీస్తూ.. లాభాలను ఆర్జిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు.

READ ALSO : Decreasing Mango Yield : తగ్గిన మామిడి దిగుబడి.. ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలు

వేసవి వచ్చిదంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. మార్కెట్‌లో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు , వాతావరణ మార్పుల కారణంగా.. మామిడి పూత ఆలస్యంగా వచ్చింది . వచ్చిన పూత చాలా వరకు నిలవలేదు. అయితే మేలైన యాజమాన్యం చేపట్టిన రైతుల తోటల్లో మాత్రం దిగుబడులు బాగున్నాయి.

READ ALSO : Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు

ఇందుకు నిదర్శనమే  నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలం, పొట్లూరు గ్రమంలో ఉన్న ఈ తోటను తీర్చిదిద్దిన రైతు సింహాద్రి శ్రీనివాసరావు. తనకున్న 4 ఎకరాల్లో ఉద్యానశాఖ అధికారుల సహకారంతో 12 ఏళ్ల క్రితం బంగినపల్లి మామిడి మొక్కలను నాటారు. నాటిన 3 ఏళ్లనుండి పంట దిగుబడులను పొందుతున్నారు. ప్రస్తుతం ఎకరాకు 25 నుండి 30 టన్నుల దిగుబడిని తీస్తూ.. ప్రతి ఏటా 7 లక్షల నికర ఆధాయం పొందుతున్నారు..