Shrimp Farming : రొయ్యపిల్లల పెంపకానికి.. బయోసెక్యూరిటీ నర్సరీలు

సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు.

Shrimp Farming : రొయ్యపిల్లల పెంపకానికి.. బయోసెక్యూరిటీ నర్సరీలు

Shrimp Farming

Updated On : August 31, 2023 / 10:20 AM IST

Shrimp Farming : డాలర్ల పంటగా పేరొందిన వనామి రొయ్యల సాగుకు నాలుగైదేళ్లుగా గడ్డుకాలం నడుస్తోంది. వ్యాధుల తీవ్రత పెరిగి పంట ఎదుగుదలకు అవరోదంగా మారుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, చెరువుల్లో సరైన యాజమాన్యం చర్యలు చేపట్టకపోవడానికి తోడు, నాణ్యమైన పిల్లల ఎంపిక చేయకపోవడంతో రొయ్యరైతులు తీవ్రనష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఆకష్టాలన్ని తోలిగిపోయే సమయం వచ్చింది. వనామి రొయ్య పిల్లల పెంపకానికి బయోసెక్యూరిటీ నర్సరీలు వచ్చేస్తున్నాయి.

READ ALSO : Making Salt : సముద్రపు నీటితో ఉప్పు తయారీ..

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కొబ్బరి చెట్ల మధ్యన కనిపిస్తున్న శ్రింప్ బయోసెక్యూరిటీ నర్సరీని చూడండీ.. షేడ్ నెట్ లో కృత్రిమంగా ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు .. అందులో పైపుల ద్వారా ఆక్సీజన్ అందిస్తున్నారు కదూ.. ఇది వనామి నర్సరీ.. గతంలో రొయ్యపిల్లను హేచరీ నుండి నేరుగా తీసుకొచ్చి చెరువుల్లో వేసి పెంచేవారు. మొదట్లో బాగానే ఉన్నా.. 5 ఏళ్లుగా అనేక వైరస్ లు, ఈహెచ్ పి సమస్యల వల్ల పిల్లలు చనిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

READ ALSO : CPR : సీపీఆర్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? గుండెపోటు బాధితుల ప్రాణాలు ఎలా కాపాడుతుంది? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

ఈ సమస్యల నుండి బయటపడేందుకు ఇప్పుడు బయోసెక్యూరిటీ  నర్సరీ ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా, పెనుమంట్రా మండలం, ఆలమూరు గ్రామంలో రైతు శ్రీనివాసరెడ్డి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకీ ఈ నర్సరీ ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది..? వనామిరొయ్య పిల్లలను ఏవిధంగా పెంచుతారు..? ఇందులో పెంచడం వల్ల రైతులకు ఎలాంటి లాభం ఉందో ఇప్పుడు సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టెక్నీషియన్ డా. రాజ్ కుమార్ సింగ్ ద్వారా తెలుసుకుందాం…

READ ALSO : TDP MPs : లోకేశ్ వద్దు, చంద్రబాబు మద్దు..! టీడీపీలో ఏం జరుగుతోంది? అంతుచిక్కని ఆ ఇద్దరు ఎంపీల తీరు

సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు. వాటినే తీసుకొచ్చి చెరువుల్లో వేయడం వల్ల.. అప్పటికే చెరువు మట్టిలో ఉన్న వైట్ గట్, ఈహెచ్ పి వైరస్ లు వృద్ధి చెంది వనామి పిల్లలకు ఆశించడంతో వేసిన నెలరోజులకే పట్టుబడి చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక చాలా మంది రైతులు నష్టాలపాలయ్యారు. ఇదే బయోసెక్యూరిటీ సిస్టంతో ఆసమస్యలను గట్టెక్కవచ్చని సిపిఎఫ్ ప్రతినిధులు చెబుతున్నారు.