Telugu States : గులాబ్ తుఫాన్..తెలుగు రాష్ట్రాల రైతుల కంట కన్నీరు

గులాబ్‌ తుఫాన్‌.. రైతుల కంట కన్నీరే మిగిల్చింది. కుంభవృష్టి వాన అన్నదాతకు అపార నష్టం కలిగించింది.

Telugu States : గులాబ్ తుఫాన్..తెలుగు రాష్ట్రాల రైతుల కంట కన్నీరు

Gulab

Gulab Cyclone : గులాబ్‌ తుఫాన్‌.. రైతుల కంట కన్నీరే మిగిల్చింది. కుంభవృష్టి వాన అన్నదాతకు అపార నష్టం కలిగించింది. మూడు రోజులుగా భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వానాకాలం పోతు పోతూ.. రైతన్నపై పిడుగులు కురిపించింది. ఈ సీజన్‌ అంతా భారీ వానలు కురవడం.. ముఖ్యంగా మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వానలు కర్షకుని కష్టాన్ని నీటిపాలు చేసింది. జూన్‌ చివర్లో, జూలై, ఆగస్టు, సెప్టెంబరు.. ఇలా ప్రతి నెలా కనీసం వారం, పది రోజులు భారీ వర్షాలు ఏదో ఒక ప్రాంతంలో పంటలను నష్టపరిచాయి. వర్షాలకు లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అనధికారికంగా తెలుస్తోంది. ఈ వర్షాకాలంలో గత జూన్‌ నుంచి ఇప్పటివరకు లక్షల ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని అనధికార అంచనా. పొలాల్లో మెకాలిలోతు నీరు చేరడమే కాకుండా.. చేతికందిన పంట కూడా నాశనం అయింది.

Read More : BiggBoss 5 : తనని నా గర్ల్ ఫ్రెండ్ చేయాలని బిగ్ బాస్ కి రిక్వెస్ట్..

అధిక వర్షపాతం : –
కురవాల్సిన దాని కన్నా 134 శాతం అదనపు వర్షపాతం నమోదు కావడం రైతుల పాలిట శాపంగా మారింది. కొద్ది గంటల్లోనే ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో పంటలు నేలవాలి వరదలో కొట్టుకుపోతున్నాయి. ప్రకృతి ప్రకోపం రైతును భోరున విలపించేలా చేసింది. గులాబ్‌ తుపాను మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ రైతులను నిండా ముంచింది. వాగులు, వంకలు, చెరువులు పొంగడంతో ఆ నీరంతా వరి పొలాల్లోకి చేరింది. చిగురు పొట్ట దశకు వచ్చిన వరి నీట మునగడంతో రైతులకు భారీ జరిగింది. పంట కుళ్లిపోయే దశకు చేరుకోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వాగుల్లో పూడికలు తీసి నీరు నేరుగా పోయే విధంగా చేస్తే ఈ నష్టం ఉండదని అన్నదాతలు అంటున్నారు.

Read More : Woman Gang Raped : యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

రాత్రికి రాత్రి బీభత్సం : –

పగలు లేని వాన.. రాత్రికి రాత్రి బీభత్సం సృష్టించి పోతోంది. నిజామాబాద్‌లో రాత్రి ఒక్కసారిగా ప్రారంభమైన వాన.. తెల్లారేసరికి 23 సెంటీమీటర్ల వాన కురిసింది. దీంతో పంట పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. సోమవారం నాటికే 10 వేలకు పైగా ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా. సంగారెడ్డి జిల్లాలో పత్తి, సోయాచిక్కుడు, కంది పంటలన్నీ నీటిపాలయ్యాయి. వరి, పొగాకు పంటలు ముంపునకు గురయ్యాయి. వికారాబాద్‌ జిల్లా దోమ మండల పరిసర గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీగా కురిసిన వర్షాలకు శివారెడ్డి పల్లి, గొడుగోనుపల్లి, కిస్టాపూర్ గ్రామాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

Read More : Gang Clash in Prison : జైల్లో గ్యాంగ్ వార్..24 మంది ఖైదీలు మృతి..48మందికి గాయాలు

ఖమ్మం జిల్లాలపై ప్రభావం : –
పత్తి, మొక్క జొన్న, వరి పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి వేసిన పంటలు నీట మునగడంతో రైతులు వాపోతున్నారు. గులాబ్‌ తుపాను ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. వరి, మిర్చి, పత్తి రైతులకు ఎక్కువ నష్టం జరిగింది. వైరా రిజర్వాయర్‌ కింద 60 వేల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ఈ సీజన్‌లో మూడుసార్లు వరదలు రావడంతో రైతులకు భారీ నష్టం మిగిలింది.

Read More : Delhi : దొరక్కూడదని..! బంగారం పేస్ట్‌‌ను అక్కడ దాచేశాడు

సిక్కోలు రైతు : –
సిక్కోలు రైతును నిలువునా ముంచింది గులాబ్‌ తుపాను. గార, ఎచ్చెర్ల, హిర, జలుమూరు, పోలాకి, సంతబొమ్మాళి, లక్ష్మినర్సుపేట, మందసం మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా వేల హెక్టార్లలో వరిపంట నీటిపాలైంది. వందల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, మొక్కజొన్న, పత్తి, బొప్పాయి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే దశలో తుపాను దెబ్బకొట్టింది.

Read More : Dry Immersion Study: అంతరిక్షంలో మహిళల శరీరం తట్టుకోగలదా? వాటర్ బెడ్‌తో ప్రయోగం!

పశ్చిమగోదావరి : –
పశ్చిమ గోదావరి రైతు కుదేలయ్యాడు. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు…పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాల్వ పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేయడంతో..దిగువనున్న పంట పొలాలు నీటమునిగాయి. లక్కవరం, పంగిడిగూడెం, శ్రీనివాసపురం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. ఎర్ర కాల్వ ముంపుతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు రైతులు. ఆచంట మండలం వేమవరంలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Read More : Mumbai : కోవిడ్ పేరు చెప్పి…రూ. 1.3 కోట్లు కొట్టేసిన తల్లీ కూతుళ్లు

విశాఖ జిల్లా : –
సుమారు 100 ఎకరాల వరి నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. పొలాల్లోకి 4 అడుగుల నీరు రావడంతో పంటలు పూర్తిగా మునిగిపోయాయని రోదిస్తున్నారు. ఎకరానికి 15 వేల రూపాయలు ఖర్చు చేశామని.. ఇప్పుడు మొత్తం నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గులాబ్‌ తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో పంటలకు భారీ నష్టం జరిగింది. అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకురావుపేట నియోజకవర్గాల్లో వరి, చెరకు దెబ్బ తిన్నాయి. వరి ముంపుకు గురవడంతో పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.