Rice Borer : వరిలో సుడిదోమ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం  చిరు పొట్ట దశ నుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. అధిక దిగుబడి సాధించేందుకు కీలకమైన ఈ దశలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమపోటు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది .

Rice Borer : వరిలో సుడిదోమ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Rice Borer

Rice Borer : తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ఈనిక దశనుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. పైరు ఏపుగా పెరిగినప్పటికీ అధిక వర్షాలు, గాలి తేమ శాతం పెరిగిపోవటంతో ఇప్పుడు సుడిదోమ ఉధృతి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పైరు సుడులు సుడులుగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి  తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా , జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం  శాస్త్రవేత్త, డా. శ్రీనివాసరెడ్డి.

READ ALSO : Weed Control : వెద వరి సాగులో.. కలుపు నివారణ

తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం  చిరు పొట్ట దశ నుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. అధిక దిగుబడి సాధించేందుకు కీలకమైన ఈ దశలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమపోటు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది . ఇప్పటికే అనేకచోట్ల శాస్త్రవేత్తలు దీని ఉధృతిని గుర్తించారు. గోధుమ రంగు దోమ, వరి దుబ్బుల మొదళ్లలో చేరి రసం పీల్చేయటం వల్ల పంట మొత్త సుడులు సుడులుగా ఎండిపోతుంది.

READ ALSO : Cultivation Of Indigenous Rice : సేంద్రియ విధానంలో దేశీ వరి సాగు

దోమను గుర్తించిన వెంటనే అధికారుల సలహాలు, సూచనలు పాటించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే, పంటను కాపాడుకొని మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. సుడిదోమ నివారణకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా , జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం  శాస్త్రవేత్త, డా. శ్రీనివాసరెడ్డి.