Tomato Cultivation : టమాట సాగులో పాటించాల్సిన మెళకువలు

శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు.

Tomato Cultivation : టమాట సాగులో పాటించాల్సిన మెళకువలు

Tomato Cultivation

Tomato Cultivation : ఏడాది పొడవునా టమాటను సాగుచేస్తున్నారు రైతులు . అయితే  శీతాకాలంలో సాగుచేసిన పంటలో అధిక దిగుబడితోపాటు, నాణ్యత అధికంగా వుంటుంది. కానీ  నిలకడలేని ధరలు ఈ పంటకు ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. దీన్ని అధిగమించేందుకు రైతులు టమాటను దఫదఫాలుగా విత్తుకుని సాగుచేస్తున్నారు. శీతాకాలపు పంటనుంచి అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు పంట చివరి వరకు ఎలాంటి మెళకువలు పాటించాలో చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.

READ ALSO : Healthy Snacks : భోజనానికి ముందు ఆకలి వేస్తుందా? ఆకలిని నియంత్రించే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే ?

శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడుభూములు ఈపంటసాగుకు పనికిరావు.

READ ALSO : Memory Power : డైరీ రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట

అయితే రైతులు అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోకపోవడం.. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో చీడపీడలు ఆశించి పంట దెబ్బతింటోంది. దీంతో ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో శీతాకాలానికి అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.

READ ALSO : United Kingdom : మహిళకు క్యాన్సర్ నుంచి విముక్తి.. డాక్టర్లు ఇచ్చిన వండర్ డ్రగ్ ఏంటంటే?

విత్తన ఎంపిక ఎంత ముఖ్యమో.. సాగునీరు, ఎరువుల యాజమాన్యం.. చీడపీడల నివారణకు కూడా అంతే ముఖ్యం. సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులు అందించాలంటున్నారు శాస్త్రవేత్తలు. చీడపీడల నివారణకు అధిక ఖర్చులు చేయకుండా తక్కువ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు.