Healthy Snacks : భోజనానికి ముందు ఆకలి వేస్తుందా? ఆకలిని నియంత్రించే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే ?

సమయానికి భోజనం తయారు కాకపోవటం వంటి పరిస్ధితులు ఉత్పన్నం అవుతాయి. ఆ సమయంలో కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవటం వల్ల ఆకలిని తగ్గించుకోవటమే కాకుండా అతిగా భోజనం చేయటాన్ని నిలువరించుకోవచ్చు.

Healthy Snacks : భోజనానికి ముందు ఆకలి వేస్తుందా? ఆకలిని నియంత్రించే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే ?

Control Your Appetite

Healthy Snacks : భోజనానికి ముందు చాలా మందికి బాగా ఆకలి వేస్తుంది. 2023లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దాదాపు 78% మంది రాత్రి భోజనానికి ముందు ఆకలితో ఉంటారు. ఈ ఆకలి కారణంగా రాత్రి భోజనం మోతాదుకు మించి అతిగా తినడానికి దారితీస్తుంది. సరైన సమయంలో భోజనం చేయలేని వారు ఆకలిని పోగొట్టుకునేందుకు కొన్ని రకాల స్నాక్స్ బాగా తోడ్పడతాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Telangana Govt : దసరా సెలవులో మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

భోజనానికి ముందు ఆకలిగా ఉంటే ఆకలిని తగ్గించడానికి ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన స్నాక్స్ రుచికరమైనవి మాత్రమే కాకుండా మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. రాత్రి భోజనానికి ముందు చాలా మంది పొట్టలో పేగులు అరుసున్న శబ్ధాలు వినిపిస్తుంటాయి. సమయానికి భోజనం తయారు కాకపోవటం వంటి పరిస్ధితులు ఉత్పన్నం అవుతాయి. ఆ సమయంలో కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవటం వల్ల ఆకలిని తగ్గించుకోవటమే కాకుండా అతిగా భోజనం చేయటాన్ని నిలువరించుకోవచ్చు.

మిశ్రమ గింజలు: కొంచెం బాదం పప్పులు, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు వంటివి తీసుకోవాలి. ఇవన్నీ ప్రోటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, రాత్రి భోజనం చేసేవరకు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటిలో మెగ్నీషియం మరియు యాంటీఆక్సిడెంట్ల వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి.

READ ALSO : Memory Power : డైరీ రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట

బెర్రీలతో కలిపి పెరుగు: పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనికి బెర్రీలను జోడించడం వల్ల ఫైబర్ , విటమిన్లు లభిస్తాయి. ఆకలిని అరికట్టడానికి, ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది సరైనదని చెప్పవచ్చు.

క్యారెట్ ముక్కులు : క్యారెట్‌లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. వాటిని తీసుకోవటం వల్ల కడుపులో సంతృప్తి కలిగిన బావన ఉంటుంది. క్యారెట్ లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

ఫ్రూట్ సలాడ్: యాపిల్స్, ఆరెంజ్ , స్ట్రాబెర్రీ వంటి పండ్ల రంగురంగుల మిశ్రమం కడుపులో సంతృప్తి భావన కలిగిస్తుంది. అంతే కాకుండా విటమిన్లు, ఫైబర్‌ను కూడా అందిస్తుంది.

READ ALSO : Dwarampudi Chandrasekhar : పవన్ ప్యాకేజీ సొమ్ములు విదేశాలకు ఎలా వెళ్ళాయో బయటకు రావడం ఖాయం: ద్వారంపూడి చంద్రశేఖర్

ఉడికించిన శనగలు ; శనగల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఉడికించి కొంచెం ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు కలుపుకుని తక్కువగా ఉప్పు,కారం కలుపుకుని చిరుతిండి గా తీసుకోవచ్చు.

మొలకలు చాట్: మొలకలలో ఫైబర్, విటమిన్లు , ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఆకలి తగ్గుతుంది. కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

భోజనం చేయటానికి ముందు ఆకలిని తగ్గించుకోవటానికి అనారోగ్యకరమైన వాటిని తీసుకోవటం కంటే ఆరోగ్యకరమైన స్నాక్స్ ను ఎంపిక చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆకలిని అరికట్టడంతోపాటు, ప్రోటీన్, ఫైబర్ , ఆరోగ్యకరమైన పోషకాలు శరీరానికి అందుతాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు పొందటం మంచిది.