గిఫ్ట్ విసిరికొట్టాడు : పక్కనే పెళ్లికూతురు.. PUBGతో పెళ్లికొడుకు ఫుల్ బిజీ

పబ్ జీ.. ఈ గేమ్ మాయలో పడితే ఎవరూ గుర్తుండరు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. పబ్ జీ గేమ్.. అదే ప్రపంచంగా గడిపేస్తారు. మిలియన్ల మంది.. గంటల కొద్ది మొబైల్ స్ర్కీన్ చూస్తుండి పోతుంటారు.

  • Published By: sreehari ,Published On : April 29, 2019 / 01:27 PM IST
గిఫ్ట్ విసిరికొట్టాడు : పక్కనే పెళ్లికూతురు.. PUBGతో పెళ్లికొడుకు ఫుల్ బిజీ

పబ్ జీ.. ఈ గేమ్ మాయలో పడితే ఎవరూ గుర్తుండరు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. పబ్ జీ గేమ్.. అదే ప్రపంచంగా గడిపేస్తారు. మిలియన్ల మంది.. గంటల కొద్ది మొబైల్ స్ర్కీన్ చూస్తుండి పోతుంటారు.

పబ్ జీ.. ఈ గేమ్ మాయలో పడితే ఎవరూ గుర్తుండరు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. పబ్ జీ గేమ్.. అదే ప్రపంచంగా గడిపేస్తారు. మిలియన్ల మంది.. గంటల కొద్ది మొబైల్ స్ర్కీన్ చూస్తుండి పోతుంటారు. చిన్న పిల్లల నుంచి యువకుల వరకు అందరూ ఈ పబ్ జీ గేమ్ అంటే పడిచస్తారు. అంత పిచ్చి ఈ గేమ్ అంటే.. ఇలాంటి పబ్ జీ మాయలో పడ్డాడో పెళ్లి కొడుకు.. తన వెడ్డింగ్ రీసెప్షన్ జరుగుతుందనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. తన చుట్టు ఏం జరుగుతుందో కూడా అతగాడికి తెలియడం లేదు. అతిథులు వస్తున్నారు. వధువరులను దీవించి వెళ్తున్నారు.

పెళ్లి కూతురు పక్కనే : పట్టించుకుంటేనా
పక్కనే పెళ్లి కూతురు ఉన్నప్పటికీ.. సరదాగా మాట్లాడటం మానేసి పబ్ జీ గేమ్ తో పెళ్లికొడుకు బిజీ అయిపోయాడు. దించిన ముఖాన్ని ఎత్తనే లేదు. అతిథులు పలకరించిన పట్టించుకోవడం లేదు. ఆఖరి పెళ్లికూతుర్ని పట్టించుకోలేదు. పబ్ జీలో మునిగిపోయిన అతడిని పెళ్లి కూతురు చూస్తుండిపోయింది. నేను ఒక్కదాన్ని పక్కన ఉన్నా.. అనే విషయం గుర్తుందా? అన్నట్టుగా అతనివైపు కోపంగా చూస్తుండిపోయింది. పెళ్లి కదా.. బాగోదు అనుకుందేమో అలానే ఉండిపోయింది.
Also Read : నుబియా Red Magic 3 : ఈ స్మార్ట్ ఫోన్లలో కూలింగ్ ఫ్యాన్

ఇంతలో ఎవరో అతిథి గిఫ్ట్ తీసుకొచ్చాడు.. పలకరించాడు. పట్టించుకోలేదు. తల ఎత్తి చూడలేదు. గిఫ్ట్ తీసి మొబైల్ ఫోన్ పై పెట్టాడో వ్యక్తి. పెళ్లికొడుక్కి చిర్రెత్తుకొచ్చింది. అంతే.. పబ్ జీ సీరియస్ గా ఆడుతుంటే.. డిస్ట్రర్బ్ చేస్తారా అని గిఫ్ట్ ను చేత్తో విసరి కొట్టాడు. మళ్లీ తల ఎత్తకుండానే అలానే పబ్ జీ ఆడటం మొదలు పెట్టాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా.. భారీగా సౌండ్ పెట్టుకుని మరి పబ్ జీ గేమ్ ఆడుతూ ఉండిపోయాడు. ఈ ఘటన ఎక్కడి జరిగిందో సరిగ్గా తెలియదు గానీ.. దీనికి సంబంధించిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటికే దేశంలో యువకులను పట్టిపీడుస్తున్న పబ్ జీ గేమ్, టిక్ టాక్ యాప్ రెండెంటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ రెండు యాప్ ల్లో అభ్యంతరకరంగా ఉండటంతో వీటిని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ లు వెల్లు వెత్తాయి. దాదాపు ఈ రెండు యాప్ లను దేశంలో బ్యాన్ అయినట్టే చెప్పుకోవాలి.

Also Read : గాల్లో తేలిపోతూ జర్నీ : డ్రైవర్ లెస్ Sky Train చూశారా?