Tirumala Hundi : శ్రీవారి హుండీలో పాకిస్థాన్ కరెన్సీతో సహా 157 దేశాల నోట్లు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. వీటిలో ఇస్లాం దేశం అయిన పాకిస్థాన్ కరెన్సీ కూడా ఉండటం విశేషం.

Tirumala Hundi : శ్రీవారి హుండీలో పాకిస్థాన్  కరెన్సీతో సహా 157 దేశాల నోట్లు

Tirumala Sri Vari Hundi

157 foreign countries currency In Tirumala Hundi : ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు మన శ్రీవారు. తిరుమలలో కొలువన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు. వెంకన్న అంటే ఠక్కున గుర్తుకొచ్చేది తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డు..ఇంకా శ్రీవారి హుండీ. తిరుమల శ్రీవారి హుండీకి కుల మత..దేశ విదేవీ బేధాలు లేవు. ఎంతోమంది ఆయనను దర్శించుకుంటుంటారు. వెంకన్నను దర్శించుకుని శ్రీవారి హుండీలో కానుకలు వేసుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. అటువంటి శ్రీవారి హుండీ ఆదాయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. బంగారం,వెండి, వజ్రాలు, వైఢూర్యాలు,ప్లాటినం, నగదు ఇలా ఎన్నో ఆయన హుండీలో వచ్చి చేరుతుంటారు. అలా వచ్చిన వాటిలో స్వదేశీ కరెన్సీ యే కాకుండా కూడా భారీగా ఉంటాయి. అలా ప్రపంచంలో 195 దేశాలు ఉండగా… శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. వీటిలో ఇస్లాం దేశం అయిన పాకిస్థాన్ కరెన్సీ కూడా ఉండటం విశేషం.విదేశీ కరెన్సీ విషయానికి వస్తే మలేషియా కరెన్సీ నోట్లు అత్యధికంగా 46 శాతం రాగా..ఆ తరువాత స్థానంలో అమెరికా డాలర్లు ఉన్నాయి. అమెరికా డాలర్లు 16 శాతం ఉండగా..అత్యంత ఆసక్తికరమైన విషయమేమంటే.. స్వామి వారికి వచ్చిన విదేశీ కరెన్సీలో పాకిస్థాన్ నోట్లు కూడా ఉండటం. 2019-20 సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలో శ్రీవారికి రూ. 27.49 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఈ ఏడాది విదేశీ నోట్లు తగ్గే అవకాశం ఉంది.

కరోనా ప్రభావం తగ్గుతున్న శ్రీవారి హుండీ ఆదాయం..
కరోనా ప్రభావం జనాలమీదనే కాకుండా దేవుళ్లమీద కూడా పడింది. ఆయా దేవాలయాల్లో హుండీ ఆదాయాలు తగ్గాయి. ఏడుకొండల వాడి ఆదాయం కరోనా ముందు.. కరోనా తర్వాత అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా ముందు భక్తులు స్వామి వారికి నెలకు వందకోట్ల రూపాయల వరకు హుండీ ద్వారా సమర్పిస్తుండగా…కరోనా అనంతరం ఆ ఆదాయం రూ.50 కోట్లు కూడా దాటడం లేదు. గత మార్చిలో అత్యధికంగా హుండీ ఆదాయం రూ.104 కోట్లు లభించగా..మేలో గణనీయంగా తగ్గుముఖం పట్టి రూ. 11 కోట్ల 95 లక్షల రూపాయలకే పరిమితం అయింది. కరోనా ముందు భక్తులు స్వామి వారికి నెలకు వందకోట్ల రూపాయల వరకు హుండీ ద్వారా సమర్పిస్తుండగా…కరోనా అనంతరం ఆ ఆదాయం రూ.50 కోట్లు కూడా దాటడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభించి.. సరిగ్గా ఈ రోజుకు ఏడాది కావస్తోంది. ఏడుకొండల వాడి ఆదాయం కరోనా ముందు.. కరోనా తర్వాత అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా ముందు భక్తులు స్వామి వారికి నెలకు వందకోట్ల రూపాయల వరకు హుండీ ద్వారా సమర్పిస్తుండగా…కరోనా అనంతరం ఆ ఆదాయం రూ.50 కోట్లు కూడా దాటడం లేదు. గత మార్చిలో అత్యధికంగా హుండీ ఆదాయం రూ.104 కోట్లు లభించగా..మేలో గణనీయంగా తగ్గుముఖం పట్టి రూ. 11 కోట్ల 95 లక్షల రూపాయలకే పరిమితం అయింది. కరోనా ముందు భక్తులు స్వామి వారికి నెలకు వందకోట్ల రూపాయల వరకు హుండీ ద్వారా సమర్పిస్తుండగా…కరోనా అనంతరం ఆ ఆదాయం రూ.50 కోట్లు కూడా దాటడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభించి.. సరిగ్గా ఈ రోజుకు ఏడాది కావస్తోంది.

2020 జూన్ 8,9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులతో పాటుగా.. 10వ తేదీ తిరుమల స్థానికులను టీటీడీ దర్శనానికి అనుమతించింది. 11వ తేదీ సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తూ వచ్చింది టీటీడీ. మొదట పరిమిత భక్తులకు అనుమతి కల్పించి తరువాత పరిస్థితుల మార్పులను బట్టి..భక్తుల సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది.ఇంతలోనే సెకండ్ వేవ్ వచ్చేసింది. ఆ సంఖ్యను మళ్లీ కుదించాల్సి వచ్చింది. అలా రాష్ట్రంతో పాటుగా దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 6 వేల వరకు దర్శన టిక్కెట్లను టీటీడీ కుందించింది.కరోనా రాకముందు వరకు శ్రీవారి ఆదాయం ఏడాదికి ఏడాది పెరుగుతూ వచ్చింది. 2019-20 వార్షిక బడ్జెట్ అంచనాను అందుకుంది. ముఖ్యంగా శ్రీవారికి హుండీ ద్వారా వ‌చ్చే దానితో పాటుగా ద‌ర్శ‌నాల టికెట్లు, ల‌డ్డూ ప్ర‌సాదం, వ‌స‌తి గదులు, క‌ల్యాణక‌ట్ట స‌హా ప‌లు మార్గాల్లో ఆదాయం వ‌స్తుంది. టీటీడీ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం ల‌భించింది. అంటే నెల‌కు వంద కోట్ల‌కు పైగా ఆదాయం లెక్కన స‌గ‌టున రోజుకి రూ. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఆదాయం వస్తుంది. ప్ర‌స్తుతం యాత్రికులు రాక‌పోవ‌డంతో టీటీడీకి ఇత‌ర ఆదాయ మార్గాలూ నిలిచిపోయాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది ల‌డ్డూ ప్ర‌సాదం విక్రయం. ల‌డ్డూ ప్ర‌సాదం విక్రయాలతో రూ. 270 కోట్ల రాబడి వచ్చింది. స‌గ‌టున రోజుకి రూ.80 ల‌క్ష‌లు దీనిపై ఆదాయం లభించింది.

శీఘ్ర ద‌ర్శ‌నం, ఇత‌ర ద‌ర్శ‌న టికెట్ల ద్వారా గ‌త ఏడాది రూ.235 కోట్ల ఆదాయం రాగా….క‌ల్యాణ క‌ట్ట‌లో స‌మ‌ర్పించే త‌ల‌నీలాలు ద్వారా రూ. 100 కోట్లు, క‌ల్యాణ మండ‌పాల అద్దె రూపంలో రూ.105 కోట్లు, ఇత‌ర వ్యాపార‌, వాణిజ్య స‌ముదాయాల అద్దెలతో పాటుగా టోల్ ఫీజు అన్నీ క‌లిపి మ‌రో రూ. 204.85కోట్ల ఆదాయం టీటీడీకి సమకూరింది. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టిటిడి రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, రూ.3,243.19 కోట్లుగా టీటీడీ పాలకమండలి సభ్యులు బడ్జెట్‌ను సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేశారు.. అంచనా కన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. అదేవిధంగా ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.270 కోట్లు అంచనా వేయగా రూ.330 కోట్లు ఆదాయం లభించిందని టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇవన్నీ కరోనా రాకముందు గణాంకాలు…. కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారాయి. 2020 మార్చి 20వ తేదీ ముంచి జూన్ 8వ తేదీ వరకు శ్రీవారి దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలను కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా టీటీడీ నిలిపివేసింది. దీంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యతో పాటుగా హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా.. టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ… రూ.721 కోట్లు రూపాయల ఆదాయం లభించింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ సైతం రివైజ్డ్ చేసి.. రూ.2,553 కోట్లకు పాలకమండలి కుదించింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,837 కోట్ల రూపాయలు అంచనా వేశాయి పాలక వర్గాలు. అయితే ఈ ఏడాది కూడా శ్రీవారి హుండి ఆదాయం భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. మార్చి మాసంలో అత్యధికంగా హుండీ ఆదాయం రూ.104 కోట్లు లభించగా.. మే మాసంలో గణనీయంగా తగ్గుముఖం పట్టి రూ. 11 కోట్ల 95 లక్షల రూపాయలకే పరిమితం అయింది.