ఏపీలో కరోనా మరణ మృదంగం….ఒక్కరోజే 1916 కేసులు..43 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : July 15, 2020 / 01:49 AM IST
ఏపీలో కరోనా మరణ మృదంగం….ఒక్కరోజే 1916 కేసులు..43 మంది మృతి

ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 43 మంది ప్రాణాలు బలి తీసుకుంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీగా కరోనా టెస్టుల నిర్వహిస్తుండగా కేసులు కూడా అంతేస్థాయిలో నమోదు అవుతున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బుటిటెన్ చేసింది. మరో సారి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. అలాగే రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.

రాష్ట్రంలో 22, 670 మందికి పరీక్షలు నిర్వహించగా రాష్ట్రానికి చెందిన 1916 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఎనిమిది మందికి కరోనా సోకింది. దీంతో ఒక్కరోజే 1916 కేసులు నమోదు అయ్యాయి. పోరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు ఏపీలో 33, 019 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 15, 144 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ నుంచి కోలుకుని 17, 467 మంది ఆస్పత్రి డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. జిల్లాల వారిగా ఇప్పటివరకు కర్నూలు 3863 కేసులు నమోదు అయ్యాయి.
ఒక్కరోజులో అనంతపురంలో 10, పశ్చిమగోదావరి 9, చిత్తూరు ఐదు, తూర్పుగోదావరి 5, కడప 5, కర్నూలు 3, ప్రకాశం 3, విశాఖ 2, విజయనగరం జిల్లాలో ఒకరిచొప్పున నమోదు అయ్యాయి. ఇప్పటివరకు అనంతపురం 3651, గుంటూరు 3356, పశ్చిమగోదావరి పశ్చిమగోదావరి 3115 మంది కోవిడ్ బాధితులు ఉన్నారు.