Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం

కంగుంది గ్రామంలో గత రాత్రి 70 ఏళ్ల వృద్ధురాలిపై దుర్గాప్రసాద్ అనే 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేశాడు. కేకలు వేసిన వృద్ధురాలిపై యువకుడు అమానుషంగా దాడికి యత్నించాడు.

Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం

Rape Attempt

old woman : కామంతో కండ్లు మూసుకుపోయిన కామాంధులు పసి పిల్లలు మొదలుకొని ముసలివాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు. వయసుతో సంబంధం లేకుండా అఘాత్యాలకు తెగబడుతున్నారు. వావివరసలు ఏమీ చూడటం లేదు. తాజాగా ఓ దుర్మార్గుడు పండు ముసలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కుప్పం మండలం కంగుంది గ్రామంలో గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

కంగుంది గ్రామంలో గత రాత్రి 70 ఏళ్ల వృద్ధురాలిపై దుర్గాప్రసాద్ అనే 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేశాడు. కేకలు వేసిన వృద్ధురాలిపై యువకుడు అమానుషంగా దాడికి యత్నించాడు. విషయం తెలిసుకున్న స్థానికులు..యువకుడని పట్టుకుని, రోడ్డుపై స్తంభానికి కట్టివేశారు.

AP Crime : 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం..

గత రాత్రి నుంచి ఈ ఉదయం వరకు యువకుడిని స్తంభానికి కట్టేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి, పరిశీలించారు. గాయపడ్డ వృద్ధురాలిని చికిత్స కోసం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు యువకుడిని కుప్పం పిఎస్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.