Brother Built Sister Idol : చనిపోయిన అక్కకు విగ్రహాన్ని కట్టించిన తమ్ముడు..రాఖీ పౌర్ణమి రోజు ఆవిష్కరణ

చనిపోయిన అక్క జ్జ్ఞాపకాలకు గుర్తుగా ఆమె నిలువెత్తు విగ్రహాన్ని కట్టించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అంతకముందు గ్రామంలో బ్యాండ్‌ బాజాతో బంధువులతో కలిసి విగ్రహాన్ని ఊరేగించారు.

Brother Built Sister Idol : చనిపోయిన అక్కకు విగ్రహాన్ని కట్టించిన తమ్ముడు..రాఖీ పౌర్ణమి రోజు ఆవిష్కరణ

Brother Built Sister Idol

Brother Built Sister Idol : అక్క…ఈ రెండక్షరాల్లో వీడని అనుబంధం ఉంది. అలాంటిది తనని కన్నతల్లిలా చూసిన సోదరి ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆ తమ్ముడు కుంగిపోయాడు. ఆమె జ్ఞాపకాలతో జీవనం సాగిస్తున్నాడు. అక్కతో ఉన్న అనుబంధాన్ని కలకాలం గుర్తుంచుకునేలా తమ్ముడు ఓ నిర్ణయం తీసుకున్నాడు.

చనిపోయిన అక్క జ్జ్ఞాపకాలకు గుర్తుగా ఆమె నిలువెత్తు విగ్రహాన్ని కట్టించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అంతకముందు గ్రామంలో బ్యాండ్‌ బాజాతో బంధువులతో కలిసి విగ్రహాన్ని ఊరేగించారు.

Srikakulam District: హృదయ విదారక ఘటన.. ప్రాణాలకు తెగించి తమ్ముడిని కాపాడిన అక్క!

రోడ్డు ప్రమాదంలో దూరమైన అక్కను నిత్యం కళ్ల ముందు చూసుకునేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేశానని రాజా అన్నాడు. నిజంగా సోదరితో ఉన్న బంధానికి ఇది నిలువెత్తు నిదర్శనం.