Adi Narayana Reddy: నన్ను చంపొచ్చు.. కానీ ధర్మాన్ని చంపలేరు.. అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు

కుక్కను ఎవరు చంపారు, గొడ్డలి ఎక్కడ కొన్నారో అందరికీ తెలుసు. వివేకా ఉదయం చనిపోతే సాయంత్రం 4 గంటలకు జగన్ వచ్చారు. ఐదు గొడ్డలి పోట్లు పడ్డాయని జగన్ ఎలా చెప్పారు? జగన్ పులివెందుల వచ్చి భాస్కర్ రెడ్డి‌తో మాట్లాడి కథ అల్లారు అని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.

Adi Narayana Reddy: నన్ను చంపొచ్చు.. కానీ ధర్మాన్ని చంపలేరు.. అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు

Adi Narayana Reddy

Adi Narayana Reddy: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. నేడోరేపో ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈక్రమంలో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేను తప్పు‌చేసి ఉంటే నన్ను ఎక్కడైనా ఉరి తీయొచ్చన్నారు. నన్ను చంపాలని అనుకుంటే చంపండి.. నన్ను చంపొచ్చు కానీ ధర్మాన్ని చంపలేరు. నా కుటుంబ సభ్యులకు చెప్పాను.. నేను లేననే బ్రతకమని అంటూ ఆదినారాయణ రెడ్డి చెప్పారు.

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

వివేకా హత్య వెనుక మహా కుట్ర ఉందని, ఆ కేసులో సంబంధం ఉన్న వారికి శిక్ష తప్పదని, అవినాష్ రెడ్డి అరెస్టుకూడా తప్పదని ఆది నారాయణ రెడ్డి అన్నారు. సీబీఐ దగ్గర అన్ని అంశాలు ఉన్నాయి. త్వరలో యాక్షన్ ఉంటుందన్నారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేసిందని అన్నారు. జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ వద్దు అంటున్నారు.. కారణమేంటని ప్రశ్నించారు. నన్ను సీబీఐ అధికారులు రెండు గంటల పాటు విచారించారని తెలిపారు.

YS Viveka case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ .. కడప నుంచి పులివెందులకు పోలీస్ స్పెషల్ ఫోర్స్..ఏం జరుగనుంది..?!

కుక్కను ఎవరు చంపారు, గొడ్డలి ఎక్కడ కొన్నారో అందరికీ తెలుసు. సీఐ వద్దు అంటున్న ఇల్లు క్లీన్ చేశారు. కుట్లు వేశారు. ఇది మా కుటుంబ సమస్య అని అవినాష్ రెడ్డి సీఐ‌తో అన్నారని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ‌పై ఒత్తిడి చేసే అవకాశం లేదు. అవినాష్ రెడ్డి నిందితుడు అని సీబీఐ చెప్పింది. ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పక జరుగుతుంది. వివేకా మొదట గుండెపోటుతో రక్తం కక్కుకున్నారని చెప్పారు. గుండెపోటు అని హైదరాబాద్‌లో విజయ్ సాయిరెడ్డి చెప్పారు. జగన్ వచ్చి గొడ్డలి పోటుఅని ఎలా చెప్పారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. దీని పై మాకు అనుమానం ఉందని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

YS Viveka case : వివేకా కేసులో సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సుప్రీం

వివేకా ఉదయం చనిపోతే సాయంత్రం 4 గంటలకు జగన్ వచ్చారు. ఐదు గొడ్డలి పొట్లు పడ్డాయని జగన్ ఎలా చెప్పారు? జగన్ పులివెందుల వచ్చి భాస్కర్ రెడ్డి‌తో మాట్లాడి కథ అల్లారు. ఇంటి చుట్టూ కెమికల్స్ చల్లారని సీబీఐ చెప్పింది.  జగన్ ఎన్ని కోట్లు సంపాదించిన ఆయన ఎప్పుడు అసంతృప్తి‌తో ఉంటాడు. జగన్ ఇప్పటికే లక్ష కోట్లు సంపాదించారు. ఇప్పడు 10లక్షల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారు అంటూ ఆదినారాయణ విమర్శించారు.