బ్రిటీష్ కాలం తర్వాత..ఇప్పుడు, ఏపీలో సమగ్ర భూ సర్వే

బ్రిటీష్ కాలం తర్వాత..ఇప్పుడు, ఏపీలో సమగ్ర భూ సర్వే

comprehensive land survey in AP : ఏపీలో సమగ్ర భూసర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలం తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఏపీలో భూసర్వే జరగనుంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 2020, డిసెంబర్ 21వ తేదీ ఆదివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తక్కెళ్లపాడులో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూవివాదాలకు చెక్ పెట్టొచ్చు అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడించారు. ఆయన 10tv తో మాట్లాడారు.

దేశంలో ఎవరూ చేయని విధంగా ఏపీ రాష్ట్రంలో భూ సర్వే నిర్వహిస్తోందన్నారు. ఇదొక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఎలాంటి వివాదాలు, సమస్యలు లేకుండా సర్వే చేయడం జరుగుతుందన్నారు. ఆధునాతమన టెక్నాలజీతో సర్వే చేస్తామని, మొదటి విడతలో 5 వేల 500 గ్రామాలు, రెండో విడతలో 6 వేల 500, మూడో విడతలో 5 వేల గ్రామాల్లో సర్వే చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో పాల్గొనే వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. సరియైనటువంటి సర్వే జరిగిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. 17.466 గ్రామాల్లో నిర్వహించేందుకు..లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల సర్వే చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్.