CM YS Jagan: రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీ బిజీ: మధ్యాహ్ననికి తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్

ఈ పర్యటన అనంతరం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్.. సాయంత్రం 5.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు

CM YS Jagan: రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీ బిజీ: మధ్యాహ్ననికి తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్

Jagan

CM YS Jagan: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమైన జగన్..దాదాపు గంటకు పైగా ప్రధానితో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఈసందర్భంగా పోలవరం నిధులు, రాష్ట్రానికి రుణ పరిమితి పెంపు సహా రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించారు. అనంతరం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తోనూ 8.30 గంటలకు గజేంద్రసింగ్ షెకావత్ తోనూ, 9.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ..సీఎం జగన్ సమావేశం అయ్యారు. కాగా బుధవారం నాడు కంజగన్ కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఉన్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ఏర్పాటు పై గడ్కరితో చర్చించారు.

Also read:Ts Cets 2022 : నేటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణా ఈ సెట్, ఎంసెట్, ఐసెట్ 2022 దరఖాస్తులు

విశాఖలో ఆరు లేన్ల రహదారి, విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి అంశంపై చర్చించినట్లు సమాచారం. విజవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని గడ్కరీని కోరారు. కత్తిపూడి – ఒంగోలు కారిడర్‌లో భాగంగా ఎన్‌హెచ్‌–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించాలని సీఎం జగన్.. నితిన్ గడ్కరీని కోరినట్లు తెలుస్తుంది. ఈ పర్యటన అనంతరం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్.. సాయంత్రం 5.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. మంత్రివర్గ మార్పులపై గవర్నర్ కి వివరణ ఇవ్వనున్న సీఎం జగన్ ఆమేరకు మంత్రుల రాజీనామాలు, కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు అందజేయనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 11న కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ను ఆహ్వానించనున్నారు.

Also read:Governor Tamilisai: ఢిల్లీకి చేరిన తెలంగాణ పంచాయితీ: అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ