Ambati Rambabu : ఫిలిం సిటీలో బెల్లీ డ్యాన్సులు..! అడిగే దమ్ముందా? అంబటి రాంబాబు

365 రోజులు మాగంటి బాబు క్లబ్ లు నడిపి, పేకాట ఆడించారు. గురజాలలో యరపతినేని పేకాట ఆడించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లీ డ్యాన్సులు జరిగాయి. దీని గురించి ఎందుకు మాట్లాడరు?

Ambati Rambabu : ఫిలిం సిటీలో బెల్లీ డ్యాన్సులు..! అడిగే దమ్ముందా? అంబటి రాంబాబు

Ambati Rambabu

Ambati Rambabu : గుడివాడ క్యాసినో అంశంపై ఏపీ రాజకీయాల్లో దుమారం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ప్రతిపక్ష టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని అంబటి మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నవ్వాలో, ఏడ్వాలో చంద్రబాబుకి తెలియడం లేదన్నారు. జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ఉండాలని సీఎం చెబితే.. దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్న అంబటి రాంబాబు.. గతంలో చంద్రబాబు కూడా జిల్లాకి ఒక ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పలేదా? అని అడిగారు.

Coronavirus: వచ్చే 14రోజుల్లో గరిష్టస్థాయికి కరోనా కేసులు.. బీ-కేర్‌ఫుల్! – ఐఐటీ నిపుణులు

గుడివాడ క్యాసినో అంశంపై అంబటి రాంబాబు స్పందించారు. ”గోవా కల్చర్ ని గుడివాడ తెచ్చారంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.. క్యాసినో, కోడి పందేలు జరిగాయని అంటున్నారు. నిజ నిర్దారణ పేరుతో గుడివాడ మీద మీకున్నది ప్రేమా? లేక కొడాలి నాని మీద కక్షతోనే ఇలా చేస్తున్నారా? మిమ్మల్ని రోజూ విమర్శిస్తున్నాడని.. తొక్కేద్దామని ప్రయత్నమా? టీడీపీ నానా యాగీ చేస్తోంది. 365 రోజులు మాగంటి బాబు క్లబ్ లు నడిపి, పేకాట ఆడించారు. గురజాలలో యరపతినేని పేకాట ఆడించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లీ డ్యాన్సులు జరిగాయి. 365 రోజులు జరుగుతున్నాయి. రామోజీ రావును నిలదీయండి. ఇది తెలుగు సంస్కృతా..? సంస్కృతి గురించి మాట్లాడే వారు దీని గురించి ఎందుకు మాట్లాడరు?” అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

”కరోనా బారిన పడ్డ కొడాలి నాని హాస్పిటల్ లో ఉన్నాడు. ఆ మూడు రోజులు ఎవరో డ్యాన్సులు, కోడి పందేలు వేస్తే పట్టుకోవాల్సింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లు మూసి వేయించాము. సంక్రాంతి మూడు రోజులు వేరు.. 365 రోజులు వేరు. ఎక్కడో ఏదో జరిగితే కొడాలి నానికి అంటగడుతున్నారు. పండగ సందర్భంగా ఏదైనా జరిగితే చర్యలు తీసుకోవాల్సిందే. కొడాలి నానిపై కక్ష ఉంటే.. తేల్చుకుందాం.. జగన్, వైసీపీ, కొడాలి నాని పై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చీప్ ట్రిక్స్ ఎవరూ నమ్మద్దు. టీడీపీ లాగా 365 రోజులు క్లబ్ లు నడిపే సంస్కృతి వైసీపీకి లేదు” అని అంబటి రాంబాబు అన్నారు.

Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..

పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపైనా అంబటి రాంబాబు స్పందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు సీఎం జగన్ న్యాయం చేశారని అంబటి రాంబాబు చెప్పారు. ఉద్యోగులు.. ప్రభుత్వ కమిటీతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదన్న అంబటి రాంబాబు.. చంద్రబాబు, అతని మీడియా ఉద్యోగుల ద్వారా కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.