Coronavirus: వచ్చే 14రోజుల్లో గరిష్టస్థాయికి కరోనా కేసులు.. బీ-కేర్‌ఫుల్! – ఐఐటీ నిపుణులు

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి రేటును తెలిపే 'ఆర్-విలువ' జనవరి 14వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ మధ్య 1.57కి తగ్గింది.

Coronavirus: వచ్చే 14రోజుల్లో గరిష్టస్థాయికి కరోనా కేసులు.. బీ-కేర్‌ఫుల్! – ఐఐటీ నిపుణులు

Corona

Coronavirus: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి రేటును తెలిపే ‘ఆర్-విలువ’ జనవరి 14వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ మధ్య 1.57కి తగ్గింది. రాబోయే పదిహేను రోజుల్లో దేశంలో మూడో వేవ్ ఇన్ఫెక్షన్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

‘R-value’ అంటే..
R-Value అంటే రీ-ప్రోడ‌క్ష‌న్ రేటు.. ఒక కోవిడ్ రోగి ఎంత‌మందికి కోవిడ్ స్ప్రెడ్ చేయ‌గ‌ల‌డు అనేది ఈ రీ- ప్రొడ‌క్ష‌న్ రేటు చెబుతుంది. ఆర్- వాల్యూ క‌నుక 1.0 కంటే ఎక్కువ ఉంటే కేసులు ఎక్కువ‌ అవుతున్న‌ట్టు లెక్క‌. అదే స‌మ‌యంలో ఆర్- ఫ్యాక్ట‌ర్ 1.0 క‌న్నా త‌క్కువ ఉన్నా.. కేసుల‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తున్నా.. పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న‌ట్టు భావించాల‌లి.

ఈ రేటు ఒకటి కంటే తక్కువకు పడిపోతే, ప్రపంచ మహమ్మారి ముగిసిపోయినట్లే. IIT మద్రాస్ అంచనాల ప్రకారం.. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ మధ్య R-విలువ 1.57గా ఉంది. జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య దీని విలువ 2.2గా ఉంది. డిసెంబర్ 25 నుంచి 31వ తేదీ మధ్య దీని విలువ 2.9గా ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేథమెటిక్స్.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్, IIT మద్రాస్, ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయ్, ప్రొఫెసర్ ఎస్ సుందర్ నేతృత్వంలో నిర్వహించిన గణనలో ఈ విషయం తేలింది.

ముంబై, కోల్‌కతాలో గరిష్ట స్థాయి ముగిసింది – డాక్టర్ జయంత్ ఝా
ఆర్థిక రాజధాని ముంబై R-విలువ 0.67కి చేరుకోగా.., ఢిల్లీ R-విలువ 0.98, చెన్నై R-విలువ 1.2, కోల్‌కతా R-విలువ 0.56కి చేరకుంది. ముంబై, కోల్‌కతాలోని ఆర్-విలువ గరిష్ట స్థాయి ముగిసినట్లుగా చెప్పారు డాక్టర్ జయంత్ ఝా. ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కరోనా సోకినవారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించడం తప్పనిసరి.

14 రోజుల్లో కరోనా వైరస్ గరిష్ట స్థాయికి..
ఐఐటీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఫిబ్రవరి 6వ తేదీ వరకు రాబోయే 14రోజుల్లో కరోనా వైరస్ గరిష్ట స్థాయికి చేరుకోనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ మధ్య, మూడవ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఆదివారం 3,33,533 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సోకిన వారి సంఖ్య 3,92,37,264 కు పెరిగింది.