Bride On Boat : వరదల్లో పెళ్లి-పడవలో పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లిన వధువు

కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని సామెత. వానొచ్చినా వరదొచ్చినా పెట్టుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకుంనేందుకు  వరదలో పడవ  వేసుకుని వధువు, వరడు ఇంటికి వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Bride On Boat : వరదల్లో పెళ్లి-పడవలో పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లిన వధువు

Bride On Boat

Bride On Boat : కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని సామెత. వానొచ్చినా వరదొచ్చినా పెట్టుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకుంనేందుకు  వరదలో పడవ  వేసుకుని వధువు, వరడు ఇంటికి వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా కురిసి భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలు జలమయమయ్యాయి.  వాగులు వంకలు పొంగి పొర్లి   లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

గోదావరి పొంగి లంక గ్రామాల్లోకి   వరద నీరు వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో 36 ఏళ్ల తర్వాత ఇలాంటి వానలు వచ్చాయిని విశ్లేషకులు చెపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో లంక గ్రామాలు నీట మునిగాయి.  ఈ క్రమంలో జులైలో వివాహానికి  ముహూర్తాలు  పెట్టించుకున్న ప్రశాంతి, అశోక్ లు  వివాహం గురించి ఆందోళన చెందారు.  వాస్తవానికి ముందుగా వారిద్దరూ ఆగస్టులో పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆగస్టులో వానలు ఉంటాయని మార్చుకుని జులైలో ముహూర్తాలు పెట్టుకున్నారు.

కానీ నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్టంలో వానలు బాగా కురిసి వరదలు వచ్చాయి. దీంతో వధువు బంధువులు పెళ్లి కూతురును ముస్తాబు చేసి పడవల్లో పెళ్లి కొడుకు ఇంటికి బయలు దేరి వెళ్ళారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Cattle Urine : పేడతో పాటు గో మూత్రం కూడా కొంటామని ప్రకటించిన ప్రభుత్వం..లీటర్ ఎంతంటే..