Cattle Urine : పేడతో పాటు గో మూత్రం కూడా కొంటామని ప్రకటించిన ప్రభుత్వం..లీటర్ ఎంతంటే..

రైతుకు ఆర్థిక ఆసరా ఇవ్వటానికి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రైతుల నుంచి ఆవుపేడను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆవుపేడతో పాటు యూరిన్ (గోమూత్రం) కూడా కొనాలని నిర్ణయించింది.

Cattle Urine : పేడతో పాటు గో మూత్రం కూడా కొంటామని ప్రకటించిన ప్రభుత్వం..లీటర్ ఎంతంటే..

Cattle Urine

Cattle Urine: రైతుకు ఆర్థిక ఆసరా ఇవ్వటానికి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రైతుల నుంచి ఆవుపేడను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆవుపేడతో పాటు యూరిన్ (గోమూత్రం) కూడా కొనాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభత్వం ఇప్పటికే గోధన్ న్యాయ్ యోజన పథకం కింద రైతుల నుంచి ఆవుపేడను సేకరిస్తోంది. కిలో పేడకు రూ.1.50 నుంచి రెండు రూపాయలు ఇస్తోంది. ఈ క్రమంలో గోవు పేడతో పాటు గోమూత్రాన్ని కూడా కొనుగోలు చేయనుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది. లీటరు గోమూత్రానికి రూ.4లు చొప్పున ఇవ్వనుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని భూపేష్ బఘేల్ ప్రభుత్వం రైతులకు సహాయం చేయడానికి గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగానే ఆవుపేడను కొనుగోలు చేస్తోంది. దీంతో పాటు ఇకనుంచి గోమూత్రాన్ని కూడా కొనుగోలు చేస్తామని ఆవు మూత్రాన్ని లీటరుకు రూ.4 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం త్వరలో సన్నాహాలు చేసింది. దీనికి సంబంధించి త్వరలో సీఎం భూపేష్ బఘేల్‌కు ప్రతిపాదన పంపనున్నారు. సీఎం ఆమోదముద్ర పడగానే రాష్ట్రంలో ఈ పథకం అమలులోకి రానుంది.

Also read : పేడను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం : కిలో ఎంతంటే..

ఈ వివరాలను అధికారులు వెల్లడిస్తూ..రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి లీటరుకు 4 రూపాయల చొప్పున ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయనుంది అని తెలిపారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ మరో రెండు వారాల్లో ప్రారంభమవుతుంది. దీని కింద పేడ సేకరణకు ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ఫిబ్రవరి 2022 లో రాష్ట్ర ప్రభుత్వం ఆవు పేడ కొనుగోలు మొదలుపెట్టిందని.. తాజాగా ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. దీని తరువాత మొత్తం పథకంపై సేకరణ, పరిశోధన పద్ధతిని నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఆవు మూత్రాన్ని లీటరుకు రూ.4 చొప్పున కొనుగోలు చేయాలని కమిటీ నిర్ణయించినట్లు సీఎం భూపేష్ బఘేల్ సలహాదారు ప్రదీప్ శర్మ తెలిపారు. త్వరలోనే సీఎం నుంచి ఆమోదం లభించనుందని తెలిపారు. ‘విలేజ్ గౌతన్ సమితి’ ద్వారా గోమూత్రాన్ని సేకరించి, పశువుల పెంపకందారులకు 15 రోజులకు ఒకసారి చెల్లిస్తారు.