YS Jagan : జగనన్న తోడు, వడ్డీ లేకుండానే రూ.10 వేలు.. నేడు రుణాల పంపిణీ

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రుణాలను జమ చే

YS Jagan : జగనన్న తోడు, వడ్డీ లేకుండానే రూ.10 వేలు.. నేడు రుణాల పంపిణీ

Jagananna Thodu Third Instalment : ఏపీ సర్కార్ మరో పథకం అమలుకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సీఎం జగన్.. 2022, ఫిబ్రవరి 28వ తేదీ సోమవారం ‘జగనన్న తోడు’ మూడో విడత ప్రారంభించనున్నారు. 5.10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. రూ. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, తొలి రెండు విడతల వడ్డీ రూ. 16.16 కోట్లు లబ్దిదారులకు జమ చేయనుంది ప్రభుత్వం. తొలి విడతలో 5.35 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందించింది ఏపీ ప్రభుత్వం. మూడో విడతతో కలిపి మొత్తం 14.16 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుందని అంచనా.

Read More : Ukraine Students: ‘సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’, ‘చాలా భయం వేసింది’

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రుణాలను జమ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి రుణాలను అందించనున్నారు. లబ్దిదారులకు ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణాలను ఇవ్వనున్నారు. 2020, నవంబర్ 25న ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా ఒక్కో లబ్దిదారునికి రూ.10 వేల చొప్పున రుణాలను అందిస్తోంది. ఈ రుణం పొందిన వ్యాపారి 12 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు చెల్లిస్తోంది.