AP Corona Upadate : తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు

ఏపీలో గడచిన 24 గంటల్లో 94వేల 595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 662 కొత్త కేసులు రాగ, చిత్తూరు జిల్లాలో 473 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3వేల 692 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

AP Corona Upadate : తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు

Ap Corona Upadate

AP Corona Upadate : ఏపీలో గడచిన 24 గంటల్లో 94వేల 595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 662 కొత్త కేసులు రాగ, చిత్తూరు జిల్లాలో 473 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3వేల 692 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరో 29 మంది కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఆరుగురు కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12వేల 884కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 18,54,754 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల 325కి తగ్గింది.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. కేసుల సంఖ్య తగ్గడం.. రికవరీలు పెరుగుతుండటంతో ఊరటనిస్తోంది. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 137, చిత్తూరు జిల్లాలో 473, తూర్పుగోదావరి జిల్లాలో 662, గుంటూరు జిల్లాలో 215, కడప జిల్లాలో 181, కృష్ణాజిల్లాలో 210,

కర్నూలు జిల్లాలో 59, నెల్లూరు జిల్లాలో 235, ప్రకాశం జిల్లాలో 322, శ్రీకాకుళం జిల్లాలో 79, విశాఖపట్నం జిల్లాలో 142, విజయనగరం జిల్లాలో 142, పశ్చిమగోదావరి జిల్లాలో 398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ప్రభుత్వం విధించిన కర్ప్యూ సత్ఫలితాలిస్తోంది.