Andhra Pradesh Govt : ఆక్సిజన్‌ బస్‌..చక్రాలపై చికిత్స

ఆక్సిజన్‌ బెడ్ల కొరత తీర్చేందుకు ఏపీ సర్కార్‌ చర్యలు ముమ్మరం చేసింది. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు సరిపడా లేకపోవడం.. అత్యవసరమైన వారికి సరైన సమయంలో బెడ్లు దొరక్కపోవడంతో.. సర్కార్‌ కీలక నిర్ణయమే తీసుకుంది. కరోనాతో బాధపడేవారికి ప్రత్యేకంగా.. ఆర్టీసీ బస్సుల్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Andhra Pradesh Govt : ఆక్సిజన్‌ బస్‌..చక్రాలపై చికిత్స

Andhra Pradesh Govt Convert Ac Buses Into Oxygen Beds

AC Buses Into Oxygen Beds : ఆక్సిజన్‌ బెడ్ల కొరత తీర్చేందుకు ఏపీ సర్కార్‌ చర్యలు ముమ్మరం చేసింది. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు సరిపడా లేకపోవడం.. అత్యవసరమైన వారికి సరైన సమయంలో బెడ్లు దొరక్కపోవడంతో.. సర్కార్‌ కీలక నిర్ణయమే తీసుకుంది. కరోనాతో బాధపడేవారికి ప్రత్యేకంగా.. ఆర్టీసీ బస్సుల్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 10 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసింది.

కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి మొత్తం 10 బస్సులను ఆక్సిజన్‌ బెడ్లతో ఏర్పాటు చేసింది ఆర్టీసీ యాజమాన్యం. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్‌ బస్సుల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, కేఆర్‌.పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో.. ఆక్సిజన్ బస్సులు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం 10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో మరిన్ని ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తామంటున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సుల్ల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బెడ్లను మంత్రి పేర్ని నాని ఈ సందర్భంగా పరిశీలించారు. బస్సుల్లో ఏర్పాట్లతో సహా సదుపాయాలను ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ మంత్రికి వివరించారు.

Read More :  Rohit Sharma: ఫ్రెండ్స్ అంటూ స్పెషల్ మెసేజ్ ఇచ్చిన రోహిత్ శర్మ